Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- ప్రియురాలి దాడిలో జననాంగం కోల్పోయిన 29 ఏళ్ల యువకుడు.
- జైపూర్ SMS ఆస్పత్రిలో అత్యవసర మైక్రోసర్జరీ.
- తెగిపోయిన అవయవాన్ని విజయవంతంగా తిరిగి అతికించిన వైద్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్‌లోని జైపూర్ సవాయ్ మాన్సింగ్(SMS) ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. ప్రైవేట్ పార్ట్ కోల్పోయిన యువకుడికి కొత్త జన్మ ప్రసాదించారు. 29 ఏళ్ల యువకుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి మర్మాంగాన్ని తిరిగి అతికించారు. 40 రోజుల చికిత్స తర్వాత ఆపరేషన్ 100 శాతం విజయవంతమైంది.
అసలేం జరిగింది:
వ్యక్తిగత గొడవల నేపథ్యంలో మే 31న యువకుడిపై అతడి ప్రియురాలు దాడి చేసింది. బ్లేడ్‌తో అతడి మర్మాంగాలు కోసేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని 4 గంటల్లోపే జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో కోల్పోయిన అవయవాన్ని తిరిగి కాపాడగలిగారు.
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
రోగిని పరీక్షించిన వెంటనే ప్లాస్టిక్ సర్జరీ విభాగం అత్యవసర మైక్రోసర్జరీ చేసింది. గంటల పాటు సాగిన ఈ క్లిష్టమైన సర్జరీలో తెగిన అవయవాన్ని తిరిగి అతికించారు. శస్త్రచికిత్స సమయంలో దెబ్బతిన్న మూత్రనాళం, కార్పొరా కావెర్నోసా, కార్పస్ స్పాంజియోసమ్ వంటి సున్నిత భాగాలను అత్యంత జాగ్రత్తగా పునర్నిర్మించారు. శస్త్రచికిత్స తర్వాత రోగిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
సుమారు 40 రోజుల తర్వాత అతను సాధారణంగా మూత్రవిసర్జన చేయగలుగుతున్నాడని, జననాంగం కూడా సాధారణ పనితీరును పూర్తిగా తిరిగి పొందిందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో ప్రతీ నిమిషం కూడా కీలమని వైద్యులు చెబుతున్నారు. గాయమైన వెంటనే ఆస్పత్రికి తీసుకురాకపోతే అవయవాన్ని కాపాడటం కష్టమవుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?