NTV Telugu Site icon

Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..

Dk

Dk

Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డీకే శివ కుమార్- సిద్ధరామయ్య మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. అయితే, దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సైతం రెండున్నరేళ్లు ఒకరు ఆ తర్వాత మరోకరు పదవీ తీసుకునేలా ఒప్పించారు. దీంతో ప్రస్తుతం డీకే శివ కుమార్ మనస్సులోని మాటలను బహిరంగంగా వ్యక్తం చేశాడు ఓ జైన సన్యాసి. సోమవారం హుబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.

Read Also: Kanaka Durga Temple: దుర్గగుడి ప్రధాన అర్చకులు మృతి!

ఇక, ఆ జైన సన్యాసి మాటలకు ప్రతిస్పందిస్తూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఇలా అన్నారు.. మీరు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్పగలను?.. ఆయన చెప్పేది నేను నియంత్రించలేను.. ఎందుకంటే, అది అతని కోరిక అన్నారు. నాకు ఏం కావాలో అన్నీ నా పార్టీ నిర్ణయిస్తుంది.. నాకు పార్టీ ముఖ్యం దాని ఆదేశాల ప్రకారం పని చేస్తా.. నేను ఏ పోస్ట్ కోసం వెతకాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అయితే, నిన్న బెళగావిలో కాంగ్రెస్ సదస్సు సందర్భంగా డీకే శివకుమార్ మద్దతుదారుల బల ప్రదర్శన చేశారు. కొప్పల్, హోసపేట, బళ్లారి, చిత్రదుర్గ్ సహా వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం కోసం ర్యాలీగా అతడి చిత్రపటాలను పట్టుకుని నినాదాలు చేశారు.

Read Also: Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

అలాగే, డీకే శివ కుమార్ ను కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన అభిమానులు కోరారు. డీకేకు సీఎం పదవీ ఇవ్వకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్థిరతను ఎదుర్కొంటుందని పార్టీలోని కొందరు మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ స్పందించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై ఊహాగానాలు అణిచివేసేందుకు ప్రయత్నించారు.. కాంగ్రెస్ పార్టీ కోసం మేము అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం.. ఎవర్ని నియమించాలి.. ఎప్పుడూ తొలగించాలో హైకమాండ్ తెలుసని ఖర్గే అన్నారు.