Site icon NTV Telugu

Mukhtar Ansari: మాఫియాడాన్ ముఖ్తార్ అన్సారీని హత్య కేసులో దోషిగా తేల్చిన కోర్టు..

Mukhtar Ansari

Mukhtar Ansari

Mukhtar Ansari: మాఫియా డాన్, రాజకీయవేత్త, గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీని హత్య కేసులో దోషిగా తేల్చింది వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు. కాంగ్రెస్ నాయకుడిని ఆగస్ట్ 3, 1991లో హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ ని వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి బయట కాల్చి చంపారు. 32 ఏళ్ల నాటి ఈ హత్య కేసులో ప్రస్తుతం అన్సాారీని దోషిగా నిర్థారించింది కోర్టు. తీర్పు వెలుబడుతున్న నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Read Also: Odisha train accident: “నా బాధ్యత ముగియలేదు”.. ఎమోషనల్ అయిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..

ఇప్పటికే కిడ్నాప్, హత్య కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అన్సారీ. ఈ కేసుల్లో ఏప్రిల్ నెలలో అతడికి కోర్టు శిక్ష విధించింది. దీంతో పాటు అతడిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ, రాజకీయాల్లో ఫేమస్ అవుతున్న సందర్భంలో 1991లో కాంగ్రెస్ నాయకుడు అవధేష్ రాయ్ ని హత్య చేశాడు. ఈ హత్య చేసిన సమయంలో అన్సారీ ఎమ్మెల్యే కాదు. ఈ కేసులో అన్సారీతో పాటు భీమ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ కేసును సీబీసీఐడీకి దర్యాప్తు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంలో జూన్ 2022లో కేసు డైరీ అదృశ్యమైంది. ఫోటో కాపీల ఆధారంగా ఈడీ కేసు విచారణ చేసింది. డూప్లికేట్ పేపర్ల ఆధారంగా తీర్పు వెలువడడం ఇదే తొలిసారి.

Exit mobile version