Actor Darshan: రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్మన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్మన్ మంగళవారం కోర్టను తనకు ‘‘విషం ఇవ్వాలి’’ అని కోరారు. తాను రోజుల తరబడి సూర్యకాంతిని చూడలేదని చెప్పారు. రేణుకాస్వామి హత్య విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముందు దర్శన్ హాజరయ్యారు. తన చేతుల్లో ఫంగస్ పెరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
జైలులో బయట అడుగు పెట్టడానికి కూడా అనుమతి లేనందున చాలా రోజులుగా సూర్యకాంతిని చూడలేదని, తన బట్టలు దుర్వాసన వస్తున్నాయని, జైలులో తాను తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నానని కోర్టుకు తెలియజేశారు. ఆ తర్వాత తనకు విషం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టు ఈ విషయాన్ని సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
Read Also: Nepal in Turmoil: సోషల్ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్‌ను తగులబెట్టారు..! నేపాల్‌లో ముదిరిన హింస..
కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను గత నెలలో కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసన ఆదేశించారు. ఆయన బెయిల్ పై ఉంటే సాక్షులను ప్రభావితం చేయగలరని, ఆయన బెయిల్‌పై బయట ఉంటే విచారణపై ప్రభావం పడుతుందని కోర్టు పేర్కొంది. దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఆయన సెలబ్రిటీ హోదాను ఒక కారకంగా పరిగణించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆగస్టు 14న దర్శన్‌ను తిరిగి జైలుకు పంపారు.
దర్శన్‌తో రిలేషన్ షిప్ కలిగి ఉన్న పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారనే కారణంగా, చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెంగళూర్‌లో తీవ్రంగా హింసించి హత్య చేశారు. ఈ కేసులో పవిత్ర గౌడతో పాటు దర్శన్ మరికొంత మంది నిందితులుగా ఉన్నారు.
