Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Jai Shankar Strong Counter To Rahul Gandhi

Jai Shankar: సరిహద్దుల్ని మార్చాలని చైనా ప్రయత్నిస్తే.. భారత సైన్యం చూస్తూ ఊరుకోదు

Published Date :December 20, 2022 , 7:24 am
By NTV WebDesk
Jai Shankar: సరిహద్దుల్ని మార్చాలని చైనా ప్రయత్నిస్తే.. భారత సైన్యం చూస్తూ ఊరుకోదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jai Shankar Strong Counter To Rahul Gandhi: సరిహద్దుల వద్ద చైనా పన్నే పన్నాగాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వబోమని, ఆ దేశాన్ని సరిహద్దు దాటనివ్వమని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట సరిహద్దుల్ని మార్చాలని చైనా ప్రయత్నిస్తే.. భారత సైన్యం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో బలగాలను సరిహద్దు వెంట మోహరించామని చెప్పిన ఆయన.. ప్రధాని మోడీ ఆదేశాలతోనే సైన్యం అక్కడుందని, రాహుల్‌ గాంధీ చెబితే కాదని చురకలంటించారు. ఇదే సమయంలో.. ఎల్‌ఏసీ వెంట భారత భూభాగాల్ని డ్రాగన్ కంట్రీ ఆక్రమించిందన్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా-జపాన్‌ కాంక్లేవ్‌’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Imran Khan: భారత్-పాకిస్తాన్ సంబంధాల మధ్య కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకి

సరిహద్దు సమస్యపై రాజకీయం చేయడం ఏమాత్రం తగదని.. పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావడం కోసం చైనాపై ఒత్తిడి తెస్తున్నామని, ఆరోపణలు వస్తున్నట్టు ఏమాత్రం నిర్లక్ష్యం వహించడంలేదని జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సైన్యాన్ని విమర్శించకూడదని హితవు పలికారు. సరిహద్దులో మన జవాన్లు తీవ్ర ప్రతికూలతల మధ్య పహారా కాస్తున్నారని.. తవాంగ్‌లో వారు చూపిన సాహసానికి గాను ప్రశంసించడంతో పాటు సూచించారు. అలాగే.. చైనా సైనికుల చేతుల్లో మన జవాన్లు దెబ్బలు తిన్నారంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. మన జవాన్లకు ‘పిటై’ అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారంటూ ప్రశ్నించారు. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని.. రాజకీయంగా విభేదాలు, విమర్శలు వచ్చినా తమకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు.

Vijay Sai Reddy: విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం

కాగా.. రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్‌, చైనా ఘర్షణలు గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్‌ యుద్ధానికి రెడీ అవుతుంటే, మోడీ పాలన మాత్రం నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి జైశంకర్ పైవిధంగా స్పందించారు. బీజేపీ నేతలు సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్‌ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india-china border
  • jai shankar
  • PM Narendra Modi
  • rahul gandhi
  • Tawang Border Issue

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions