Jai Shankar Strong Counter To Rahul Gandhi: సరిహద్దుల వద్ద చైనా పన్నే పన్నాగాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వబోమని, ఆ దేశాన్ని సరిహద్దు దాటనివ్వమని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట సరిహద్దుల్ని మార్చాలని చైనా ప్రయత్నిస్తే.. భారత సైన్యం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో బలగాలను సరిహద్దు వెంట మోహరించామని చెప్పిన ఆయన.. ప్రధాని మోడీ ఆదేశాలతోనే సైన్యం అక్కడుందని, రాహుల్ గాంధీ చెబితే కాదని చురకలంటించారు. ఇదే సమయంలో.. ఎల్‌ఏసీ వెంట భారత భూభాగాల్ని డ్రాగన్ కంట్రీ ఆక్రమించిందన్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా-జపాన్ కాంక్లేవ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Imran Khan: భారత్-పాకిస్తాన్ సంబంధాల మధ్య కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకి
సరిహద్దు సమస్యపై రాజకీయం చేయడం ఏమాత్రం తగదని.. పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావడం కోసం చైనాపై ఒత్తిడి తెస్తున్నామని, ఆరోపణలు వస్తున్నట్టు ఏమాత్రం నిర్లక్ష్యం వహించడంలేదని జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సైన్యాన్ని విమర్శించకూడదని హితవు పలికారు. సరిహద్దులో మన జవాన్లు తీవ్ర ప్రతికూలతల మధ్య పహారా కాస్తున్నారని.. తవాంగ్‌లో వారు చూపిన సాహసానికి గాను ప్రశంసించడంతో పాటు సూచించారు. అలాగే.. చైనా సైనికుల చేతుల్లో మన జవాన్లు దెబ్బలు తిన్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. మన జవాన్లకు ‘పిటై’ అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారంటూ ప్రశ్నించారు. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని.. రాజకీయంగా విభేదాలు, విమర్శలు వచ్చినా తమకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు.
Vijay Sai Reddy: విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం
కాగా.. రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్, చైనా ఘర్షణలు గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్ యుద్ధానికి రెడీ అవుతుంటే, మోడీ పాలన మాత్రం నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి జైశంకర్ పైవిధంగా స్పందించారు. బీజేపీ నేతలు సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.