Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా
- ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా
- అనారోగ్య కారాణాలతో పదవికి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ (74) రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక రాజీనామా లేఖలో ప్రధాని మోడీకి, రాష్ట్రపతికి ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం రాజీనామా వెంటనే అమలులోకి వస్తుంది.
వైద్యుల సలహా మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని ఉపరాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన లేఖలో ధన్‌ఖడ్ పేర్కొన్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ధన్‌ఖడ్ 1951, మే 18న జన్మించారు. 1978–1979 కాలంలో రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. 2019–2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1989–1991 కాలంలో లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు. 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇది కూడా చదవండి: PM Modi: జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు.. అచ్యుతానందన్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన మోడీ
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన సమావేశాలకు రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్ ఖడ్ సభకు హాజరయ్యారు. అనూహ్యంగా సాయంత్రానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై అనేకమైన వదంతులు వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే రాజీనామా చేశారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. బీహార్ వ్యక్తికి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లు పదవి ఉండగా ఇంత సడన్‌గా ఎందుకు రాజీనామా చేశారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!