RJD chief’s controversial comments: బీహార్ రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) చీఫ్ జగదానంద్ సింగ్ శనివారం మరో వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆర్ఎస్ఎస్, హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సైద్ధాంతిక విభాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), తీవ్రవాద గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) రెండూ కూడా ఒకటే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు గ్రూపులు కూడా వారి మతస్తులకు సేవ చేయాలని అనుకుంటున్నాయని సమర్థించాడు. ఆర్ఎస్ఎస్ లాగే పీఎఫ్ఐ కూడా సమాజానికి సేవ చేయాలని అనుకుంటుందని వ్యాఖ్యలు చేశాడు. పీఎఫ్ఐ వారిని దేశ వ్యతిరేకులని ఎందుకు అంటున్నారని.. ప్రశ్నించారు. భద్రతా దళాలకు పట్టుబడుతున్న పాకిస్తాన్ ఏజెంట్లు అంతా ఆర్ఎస్ఎస్, హిందూ సమాజానికి చెందిన వారే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Read Also: Missing Pet Parrot Found: పెంపుడు చిలుకను పట్టించినందుకు రూ. 85,000 బహుమానం.. ఎక్కడో తెలుసా..?
ఇటీవల బీహార్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీలు జరిగే సమయంలో అల్లకల్లోలం చేయాలని ప్లాన్ చేశారనే ఆరోపణలతో పీఎఫ్ఐపై బీహార పోలీసులకు కేసులు నమోదు చేశారు. ప్రధాని మోదీని చంపాలనే లక్ష్యంగా పీఎఫ్ఐ పనిచేస్తుందని.. అందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పీఎఫ్ఐ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. పుల్వారీ షరీఫ్ కేసులో ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏని విచారించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంట్లో భాగంగా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ముగ్గురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పుల్వారీ షరీఫ్ కేసులో పోలీసులు జరిపిన దాడుల్లో పలు అభ్యంతకర పత్రాలు బయటపడ్డాయి. భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చడంతో పాటు.. టర్కీ వంటి ఇస్లామిక్ దేశం సహాయంతో భారత ముస్లింల ద్వారా భారత దేశంపై సాయుధ దాడిని ప్రారంభించాలనే ‘విజన్ 2047 ఇండియా’ పేరిట పత్రాలు పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ వారికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.