Site icon NTV Telugu

lottery: కంట్రోల్ రూం ఆపరేటర్ని వరించిన అదృష్టం.. లాటరీలో రూ.45 కోట్లు గెలుపు..

Kerala Man Win ₹ 45 Crore

Kerala Man Win ₹ 45 Crore

lottery: గల్ఫ్ కంట్రీస్‌లో నివసిస్తున్న భారతీయలపై లాటరీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా యూఏఈ లాటరీ డ్రాల్లో భారతీయులు గెలుపొందుతున్నారు. యూఏఈలో నివసిస్తున్న కనీసం ఐదుగురు భారతీయులు వారానికి లాటరీ లేదా వీక్లీ డ్రాల్లో గెలుపొందుతున్నారు. వీరిలో ఎక్కువగా పనిచేయడానికి అక్కడికి వెళ్లిన వారినే ధనలక్ష్మీ వరిస్తోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఈ లాటరీలను గెలుచుకుంటున్నారు.

బుధవారం జరిగిన 154 వ డ్రాలో శ్రీజు అనే కేరళవాసి 20,000,000 దిర్హామ్స్ అంటే సుమారుగా రూ. 45 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో కంట్రోల్ రూం ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీజు మహ్‌జూజ్ సాటర్డే మిలియన్స్‌ని గెలుచుకున్నారు.

Read Also: Koti Deepotsavam 3rd Day: మూడో రోజు ఘనంగా కోటి దీపోత్సవం.. వైభవంగా జోగులాంబ కళ్యాణం

కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు గత 11 సంవత్సరాలుగా దుబాయ్‌కి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలోని ఫుజైరాలో నివసిస్తున్నారు. అక్కడే పనిచేస్తున్నాడు. ఇంత అద్భుతమైన వార్త విన్న తర్వాత నాకు నోటమాట రాలేదని, ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాని శ్రీజు చెప్పారు. నేను మహ్‌‌జూజ్ అకౌంట్ చెక్ చేసుకున్న సమయంలో కారులో ఉన్నానని, అది చూసి నేను నా కళ్లను కూడా నమ్మలేకపోయానని, ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డానని చెప్పారు. వచ్చే డబ్బులో ఇండయాలో ఇంటిని కొనుగోలు చేస్తానని చెప్పారు.

గత శనివారం ఎమిరేట్స్ డ్రా FAST5తో మరో భారతీయుడు రాఫెల్ బహుమతిని గెలుచుకున్నాడని గల్ఫ్ న్యూస్ తెలిపింది. కేరళకు చెందిన శరత్ శివదాసన్, దుబాయ్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల ప్రొక్యూర్‌మెంట్ ప్రొఫెషనల్, పాల్గొన్న రెండు నెలల్లోనే 50,000 దిర్హామ్స్ (సుమారు ₹ 11 లక్షలు) గెలుచుకున్నారు. ముంబైకి చెందిన భావ్‌సర్ అనే వ్యక్తి రూ. 16 లక్షల్ని గెలుచుకున్నాడు.

Exit mobile version