Site icon NTV Telugu

Smart Cities Awards: ఇండియాలో అదే స్మార్ట్ సిటీ.. ఎందుకో తెలుసా?

Indore

Indore

Smart Cities Awards: దేశంలో ఉత్తమ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రకటించింది. ఆయా నగరాల్లో జరుగుతున్న అభివృద్ధితోపాటు.. నగరంలో ఉన్న సౌకర్యాలు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని స్మార్ట్ సిటీల ఎంపికను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండర్‌ నగరం అత్యంత స్మార్ట్ సిటీగా నిలిచింది. అత్యుత్తమ రాష్ట్రంలో మధ్యప్రదేశ్‌ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి గానూ ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ ఉత్తమ ‘స్టేట్‌ అవార్డు’ గెలుచుకోగా, తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం దేశంలోనే అత్యుత్తమ స్మార్ట్ సిటీగా ఎంపిక కాగా.. ఆ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్ ఉండగా.. మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. ఇక అత్యుత్తమ రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి. వివిధ ప్రాజెక్టుల ఫలితాలు, ప్రాజెక్టుల ప్రగతి, బహుమతుల కోసం ప్రజంటేషన్ ఇచ్చిన తీరు వంటివాటి ఆధారంగా నగరాలు, రాష్ట్రాల్లో ఉత్తమమైనవాటిని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) సెప్టెంబరు 27న ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Read Also: Pawan Kalyan: కౌంట్‌డౌన్‌ స్టార్ట్… ట్రిపుల్ ధమాకా లోడింగ్!

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ కేటగిరీల్లో 66 పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సామాజిక మాధ్య ట్వీట్టర్‌ ఎక్స్ లో ఇచ్చిన ట్వీట్‌లో, ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్ అవార్డ్స్, 2022లో ఉత్తమ రాష్ట్రం అవార్డు పొందిన మధ్య ప్రదేశ్‌ను అభినందించారు. ఈ రాష్ట్రంలోని ఏడు నగరాల్లో రూ.15,696 కోట్ల విలువైన బహుళ రంగ ప్రాజెక్టులు 779 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ పథకంలో గత 6 సంవత్సరాల నుంచి ఇండోర్ నగరం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా పురస్కారాలను పొందుతున్నదని గుర్తు చేశారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో 2022లో మధ్య ప్రదేశ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2021లో ఇండోర్, సూరత్ ప్రథమ స్థానాన్ని పంచుకున్నాయి. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్, 2022లో బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ కేటగిరీలో కోయంబత్తూరుకు ప్రథమ స్థానం లభించించగా.. మోడల్ రోడ్ల నిర్మాణం, సరస్సులు, చెరువుల పునరుద్ధరణలో ప్రగతి బాటలో పయనిస్తున్నందుకు ఈ పురస్కారం లభించింది. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2022లో ఎకనమిక్ కేటగిరీలో జైపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొబిలిటీ, గవర్నెన్స్ విభాగాల్లో చండీగఢ్‌లోని పబ్లిక్ బైక్ షేరింగ్, ఈ-గవర్నమెంట్ సర్వీసెస్ ప్రధమ స్థానంలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో చండీగఢ్‌కు ప్రథమ స్థానంలో నిలిచింది.

Exit mobile version