NTV Telugu Site icon

ISRO: సత్తా చాటిన ఇస్రో.. విజయవంతంగా మేఘా ట్రోపిక్-1 శాటిలైట్ కూల్చివేత

Isro

Isro

ISRO: ఇస్రో మరోసారి సత్తా చాటింది. దశాబ్ధకాలంగా సేవలు అందిస్తూ, జీవిత కాలం ముగిసిపోయిన మేఘా ట్రోపిక్-1 శాటిలైన్ ను విజయవంతంగా ధ్వంసం చేసింది ఇస్రో. అత్యంత కట్టుదిట్టమైన ప్లానింగ్ లో పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు దూరంగా కూల్చివేసింది. అక్టోబర్ 2011లో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టబడిన మేఘా ట్రోఫిక్-1 ఉష్ణమండల వాతావరణం గురించి విలువైన సమాచారాన్ని దశాబ్ధకాలంగా అందిస్తూ వస్తోంది. భారత్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపాయి.

Read Also: Immoral Relationship : పోర్న్ వీడియో చూసిందని భార్యను చంపిన భర్త

మేఘాట్రోపిక్-1 నియంత్రిత రీ ఎంట్రీ ప్రయోగం ద్వారా మార్చి 7, 2023న విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. 2011లో అంతరిక్షంలో ప్రవేశపెట్టబడిన తర్వాత మూడేళ్ల పాటు సేవలు అందిస్తుందని భావించినప్పటికీ.. దశాబ్ధకాలంగా శాటిలైట్ పనిచేసింది. శాటిలైట్ జీవిత కాలం ముగిసిన తర్వాత ధ్వంసం చేయాలని ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ(యూఎన్ఐఏడీసీ) సూచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

మేఘా ట్రోపిక్-1లో ఇంకా 125 కిలోల ఆన్ బోర్డ్ ఇంధనం ఉంది. దీన్ని ఉపయోగించి పూర్తిగా నియంత్రిత రీఎంట్రీని సాధించినట్లు ఇస్రో తెలిపింది. భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యే విధంగా ఈ ఇంధనాన్ని మండించి రెండుసార్లు డీ ఆర్బిట్ బర్న్ చేసిన తర్వాత పసిఫిక్ సముద్రంలో కూల్చివేశారు. ఉపగ్రహాలను అంతరిక్షంలో ధ్వంసం చేసే శక్తి కేవలం కొన్ని దేశాలకు మాత్రమే సొంతం. అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. తాజాగా భారత్ ఈ జాబితాలోకి చేరింది.