Site icon NTV Telugu

Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..

Israel Iran Conflict

Israel Iran Conflict

Israel Strikes: ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. 24 గంటల్లో మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలపై ఎటాక్ చేసింది. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలతో సహా 200కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడులు చేసినట్లు తెలిపింది. ఫోర్డూ అణుకేంద్రం సమీపంలో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. అంతకుముందు రోజు, శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ మొదటగా ఇరాన్‌పై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, ఇరాన్ ఇజ్రాయిల్‌పై డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసింది. అయితే, ఇజ్రాయిల్ ఈ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకుంది.

Read Also: PM Modi: మోడీ, బెంజమిన్ నెతాన్యహు ఫోన్ సంభాషణ.. ఇరాన్‌ దాడులపై భారత్‌ స్పందన..!

శుక్రవారం, ఇజ్రాయెల్ ఇరాన్ రాజధానిపై దాడి చేసింది, అది దేశ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని కనీసం ఇద్దరు అగ్ర సైనిక అధికారులను, ఆరుగురు అగ్ర అణు శాస్త్రవేత్తలను చంపింది. 1980 ఇరాక్ వార్ తర్వాత ఇరాన్ ప్రస్తుతం అత్యంత భీకరమైన దాడుల్ని ఎదుర్కొంటోంది. . ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించి యుద్ధాన్ని ప్రారంభించిందని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఆరోపించారు. ఈ దాడుల్లో 78 మంది మరణించారని, వారిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారని, 320 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ యూఎన్ ప్రతినిధి తెలిపారు. శనివారం ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్ పోర్టు తగలబడింది. మిస్సైల్ దాడిలో ఎయిర్ పోర్టు తగలబడింది. ఇది ఇరాన్ సైనిక, సివిల్ కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. ప్రస్తుతం దీనిని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది.

Exit mobile version