Site icon NTV Telugu

Delhi Car Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్.. భారత్‌కు ఇజ్రాయిల్ సంఘీభావం..

Delhi Car Blast

Delhi Car Blast

Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకొట వద్ద కారు బ్లాస్ట్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం, కారులో అమోనియం నైట్రేట్ నింపుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మరణించారు. కేసు విచారణను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ)కు అప్పగించారు. బాంబ్ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని విడిచిపెట్టమని ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ పర్యటనలో ఉన్న సమయంలో వార్నింగ్ ఇచ్చారు.

Read Also: IP66+IP68+IP69 రేటింగ్స్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో Oppo Reno 14F 5G Star Wars Edition లాంచ్కు సర్వం సిద్ధం..!

ఇదిలా ఉంటే, ఈ దాడిపై ఇజ్రాయిల్ స్పందించింది. ఈ దాడి విషయంలో భారత్‌కు సంఘీభావం తెలియజేసింది. ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ మాట్లాడుతూ..”భారత ప్రజలకు, ముఖ్యంగా ఢిల్లీ నడిబొడ్డున జరిగిన పేలుడులో మరణించిన అమాయక బాధితుల కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుస్తుంది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ భారతదేశంతో నిలుస్తుంది” అని అన్నారు.

Exit mobile version