కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానకారణమైన ముఖ్యమంత్రి యడ్డియూరప్ప ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారికి ముఖ్యమైన పదవుల్లో కొనసాగే అవకాశం లేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన యడ్డియూరప్ప విషయంలో ఇప్పటికే రెండేళ్లు ఆగింది. రెండేళ్ల క్రితం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో యడ్డియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల కాలంలో పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన రాజకీయ అనుభవంతో అన్నింటిని పరిష్కరించుకుంటూ వస్తున్నారు. కాగా, ఈరోజు బీజేపీ కీలక భేటీ జరగబోతున్నది. ఈ భేటీలో ఆయన తప్పని సరిగా పార్టీ నిబంధనలకు కట్టుబడి తప్పుకోవాలి అని అధిష్టానం సూచిస్తే తప్పుకోవాల్సి ఉంటుంది. రేపు రెండేళ్ల ఉత్సవాల తరువాత ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంటుంది.
యడ్డియూరప్ప తప్పుకోక తప్పదా?
