Site icon NTV Telugu

Nitish Kumar: ఇదేమైనా ఇంగ్లాండా..? మాతృభాషలో మాట్లాడండి..

Nitish Klumar

Nitish Klumar

Nitish Kumar: బీహర్ సీఎం ముఖ్య అతిథిగా హాజరైన ఓ కార్యక్రమంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగం చేస్తున్న ఓ వ్యవసాయ పారిశ్రామికవేత్తను సీఎం నితీష్ కుమార్ వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెబుతూ అమిత్ కుమార్ అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రప్రభుత్వం ‘నాలుగో వ్యవసాయ రోడ్ మ్యాప్’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పాట్నాలోని బాపు సభాగర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.

Read Also: Sadhvi Prachi: స్వరా భాస్కర్ పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి “ఫ్రిజ్” చూడాల్సింది..

పూణేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమిత్ కుమార్ అన్నింటిని వదులుకుని సొంత జిల్లాలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. ఇందుకు తగిన వాతావరణం కల్పించిన సీఎం నితీష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఆయన ఇంగ్లీష్ లో ప్రసంగిస్తుండటంతో, సీఎం నితీష్ కుమార్ కల్పించుకని.. మీరు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను వాడుతుడటంతో మధ్యలో కల్పించుకోవాల్సి వచ్చిందని, ఇదేమైనా ఇంగ్లాండా.? మీరు బీహార్ లో పనిచేస్తున్నారు, సామన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని చేస్తున్నారని, గవర్నమెంట్ స్కూల్స్ బదులు సర్కారీ యోజన అనలేరా..? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో సీఎం వ్యాఖ్యల్ని స్వాగతించారు.

నేనూ ఇంజనీరింగ్ చదివాను, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించాను ఇదే వేరే విషయం, మన రోజూవారీ కార్యకలాపాలకు ఈ భాషను ఎందుకు ఉపయోగించాలని అన్నారు. అయితే ఈ విషయంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బహిరంగ ప్రసంగంలో ఆంగ్ల పదాలను ఉపయోగించడంపై ఆయన అభ్యంతరం పూర్తిగా హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర బిజెపి నాయకుడు, ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ అన్నారు. ప్రధాని పదవి పగలి కలలతో అలసిపోయి నితీష్ కుమార్ ఉన్మాదంతో మాట్లాడుతున్నారని అన్నారు.

Exit mobile version