Site icon NTV Telugu

PM Modi: గూగుల్ ఏఐ టూల్ జెమిని.. ప్రధాని మోడీపై అనుచిత సమాధానం.. కేంద్రం సీరియస్..

Pm Modi

Pm Modi

PM Modi: గూగుల్ ఏఐ టూల్ జెమిని, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత సమాధానం ఇవ్వడంపై కేంద్రం సీరియస్ అయింది. ఐటీ నియమాలను, క్రిమినల్ కోడ్‌ని ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గుగూల్‌కి వ్యతిరేకం చర్యలు ఉంటాయని అన్నారు. మోడీపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా జెమనీ పక్షపాతంతో కూడిన సమాధానం చెప్పినట్లు ఓ జర్నలిస్టు సమస్య తీవ్రతను లేవనెత్తారు.

Read Also: Yana Mir: “నేను మలాలా‌ని కాదు, నా దేశంలో సురక్షితంగా ఉన్నా”.. కాశ్మీరీ యువతి ప్రసంగం వైరల్..

‘‘ప్రధాని మోడీ ఫాసిస్టా..?’’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, దీనికి జెమినీ ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. అయితే, ఇలాంటి ప్రశ్ననే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల గురించి అడగ్గా.. ‘‘ఖచ్చితంగా, స్పష్టంగా చెప్పలేము’’ అంటూ దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చింది. దీనిపై ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ..‘‘ ఇవి ఐటీ చట్టంలోని మధ్యవర్తిత్వ నిబంధనలు(ఐటీ రూల్స్) రూల్ 3(1)(బి) యొక్క ప్రత్యక్ష ఉల్లంఘనలు మరియు క్రిమినల్ కోడ్‌లోని అనేక నిబంధనల ఉల్లంఘనలు’’ అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version