అసలే పండగ సీజన్. అందరూ పల్లెబాట పడుతున్నారు. దేశంలో ఎంతో సంబరంగా జరుపుకునేది సంక్రాంతి పండుగనే. పట్టణాల్లో.. విదేశాల్లో ఉన్నవారంతా కచ్చితంగా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలు ఖాళీగా లేవు. ఫుల్‌రష్‌గా ఉంటున్నాయి. రిజర్వేషన్, జనరల్ అని తేడా లేకుండా కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ వారం రోజులు రైల్వే సిబ్బంది కూడా చేతులెత్తేస్తారు. వేలాది మందిగా వచ్చే ప్రయాణికులను కంట్రోల్ చేయలేక వదిలిపెట్టేస్తుంటారు.
ఇది కూడా చదవండి: Kondapochamma Sagar : విషాదం నింపిన వినోదం.. ఒకరి మృతదేహం లభ్యం..
ఇదిలా ఉంటే ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆర్‌ఏసీనో.. లేదంటే వెయింటింగో మొత్తానికి టికెట్ బుక్ అయితే చాలు వెళ్లిపోదాం అనుకుంటారు. ఇంకొందరు టికెట్ క్యాన్సిల్ చేసేవాళ్లు ఉంటారు. ఇలా అన్నింటికీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌పైనే ఆధారపడతారు. అలాంటిది ఈ పీక్‌స్టేజ్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెబ్‌సైట్ సరిగ్గా పని చేయక ప్రజలు లబోదిబో అంటున్నారు. ఇదేంట్రా బోబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, రైల్వే యాప్‌ల్లో భారీ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు. అలాగే రద్దు కూడా చేసుకోలేకపోతున్నారు. ఇక తత్కాల్ అయితే అసలు బుకింగ్ అవ్వడం లేదు. దీంతో ప్రజలు రైల్వేకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. వెబ్‌సైట్ అంతరాయాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. డిసెంబర్‌లో మొదలైన ఈ అంతరాయం శనివారంతో నాల్గోసారి. ఈ మధ్య వరుసగా అంతరాయం ఏర్పడుతోంది. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.
సోషల్ మీడియా వేదికగా రైల్వేశాఖకు కంప్లంట్స్ చేస్తున్నారు. వైబ్‌సైట్ పని చేయక చాలా మంది నిరుత్సాహానికి గురవుతున్నారు. సైట్ ఓపెన్ చేయగానే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలుపుతోంది. ఫిర్యాదుదారులు.. రైల్వే మంత్రికి ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేశాఖ మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Rajiv Bajaj : 90 గంటల పని సూత్రానికి తగిన సమాధానం ఇచ్చిన రాజీవ్ బజాజ్.. అసలేమైందంటే ?