Site icon NTV Telugu

IRCTC: పనిచేయని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌.. దీపావళి ప్రయాణికుల ఆందోళన

Irctc

Irctc

దేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ కోసం ఎక్కడున్నా సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా వేడుకలు జరుపుకుంటారు. ఇక బీహార్‌లో అయితే ఎన్నికల పండుగ కూడా జరుగుతోంది. అంతేకాదు ఈనెల 25 నుంచి 28 వరకు ఛత్ పండుగ కూడా జరగబోతుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం వెలుపుల ఎక్కడున్నా సరే సొంతూళ్లకు వచ్చేస్తారు. ఇలాంటి పండుగ సమయంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసిన లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. శుక్రవారం ఉదయం నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ పని చేయడం మానేసింది. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో దీపావళి పండుగపై నీళ్లు చల్లినట్లైంది. టికెట్లు బుక్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్, యాప్‌కు కూడా పని చేయడం లేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ కావడం లేదు. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎర్రర్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mary Millben: రాహుల్‌గాంధీకి ఆ చతురత లేదు.. మోడీపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అమెరికా గాయని

దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారులు స్పందించారు. వైబ్‌సైట్, యాప్ క్రాష్ అయిందని.. తత్కాల్ రద్దీ సమయంలో ఈ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తిస్తున్నారని.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

పండుగ సమయాల్లో వెబ్‌సైట్ ఎర్రర్ రావడం ఇదే తొలిసారి కాదు. ప్రతి పండుగ సమయాల్లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంటుంది. విపరీతమైన రద్దీ కారణంగా అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్రస్తుతం ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Bengaluru: ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.. విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం

Exit mobile version