IRCTC: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ అందించింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల జర్నీ క్యాన్సిల్ చేసుకోవాలనుకునే వారు డబ్బులు నష్టపోకుండా ఐఆర్‌సీటీసీ చర్యలు చేపట్టింది. టికెట్‌ను తమ కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేసేలా వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకోసం 24 గంటల ముందే టికెట్ ప్రింటవుట్ తీసుకుని కుటుంబ సభ్యుల ఐడీ కార్డుతో కలిపి రిజర్వేషన్ కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, కూతురు, కుమార్తె, భర్త, భార్య వంటి రిలేషన్‌షిప్ ఉన్నవారికే టిక్కెట్ బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. టిక్కెట్ కన్ఫర్మ్ అయినవారికి మాత్రమే ఈ వెసులుబాటు లభిస్తుందని వెల్లడించింది.
Read Also: టీ20 వరల్డ్‌కప్‌లో నమోదైన టాప్-10 అత్యుత్తమ రికార్డులు
కాగా ఒకసారి బదిలీ చేసిన టిక్కెట్‌ను రెండో సారి బదిలీ చేసేందుకు కుదరదు. అంతేకాకుండా ఎవరైతే బదిలీ చేసుకున్న టిక్కెట్ ద్వారా ప్రయాణిస్తారో.. వారు తప్పనిసరిగా ముందు టిక్కెట్ బుక్ చేసుకున్న వారి గుర్తింపు పత్రాలను వెంట తీసుకువెళ్లాలి. ఆధార్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందే టిక్కెట్ బదిలీ సంబంధించి అర్జీ పెట్టుకోవాలి. ఈ సమయం ప్రయాణికులను బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అయితే రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి.. కానీ పండగ, పెళ్లి వంటి వ్యక్తిగత పనులపై ప్రయాణించే వాళ్లు మాత్రం 48 గంటల ముందే టిక్కెట్‌ను బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది.