NTV Telugu Site icon

Iran warns Israel: హమస్ చీఫ్ హనియే హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుంది.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..

Ismail Haniyeh

Ismail Haniyeh

Iran warns Israel: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే అనూహ్యంగా హత్యకు గురవ్వడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. ఈ హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్‌తో పాటు హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తోంది. గురువారం టెహ్రాన్‌లో హనియే అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు.

Read Also: Ashwini Vaishnaw: కాంగ్రెస్ హయాంతో ఎక్కువ రైలు ప్రమాదాలు.. గణాంకాలతో సహా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..

ఈ హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ గురువారం ఇజ్రాయిల్‌కి వార్నింగ్ ఇచ్చింది. అంత్యక్రియలకు ముందు ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ప్రార్థనలకు నేతృత్వం వహించారు. టెహ్రాన్ సిటీ సెంటర్‌లో, హనియే మరియు పాలస్తీనా జెండాల పోస్టర్‌లను వేలాది మంది హాజరయ్యారు. బుధవారం తెల్లవారుజామున హనియే హత్య జరిగింది. ఈ దాడిలో హనియేతో పాటు అతడి బాడీగార్డు కూడా మరణించాడు. అంతకుముందు ఇజ్రాయిల్ బీరూట్‌పై జరిపిన దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ ని హతమర్చారింది.

అయితే, హనియే హత్యపై ఇజ్రాయిల్ తమ ప్రమేయం లేదని చెప్పింది. అక్టోబర్ 07 నాటి దాదుల తర్వాత ఇజ్రాయిల్ హమాస్ కీలక నేతల్ని లక్ష్యంగా చేసుకుంటుంంది. గత నెలలో గాజాలో జరిగిన వైమానిక దాడిలో అక్టోబర్ 07 నాటి దాడులకు సూత్రధారిగా ఉన్న మహ్మద్ దీఫ్‌ని హతమార్చినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ గురువారం ధ్రువీకరించింది. హమాస్‌ని పూర్తిగా నాశనం చేసే వరకు యుద్ధం ఆగేది లేదని పలుమార్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు.