Iran Oil: భారత్‌పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- ఇరాన్‌పై 60 రోజలు పాటు అమెరికా ఆంక్షల సడలింపు..
- భారీగా నిల్వ ఉన్న ముడి చమురు అమ్మాలని చూస్తున్న ఇరాన్..
- భారత్‌పై భారీ ఆశలు పెట్టుకున్న టెహ్రాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Oil: ఇరాన్‌పై విధించిన ఆంక్షల్ని అమెరికా 60 రోజలు పాటు సడలించింది. దీంతో ఇరాన్ తన వద్ద ఉన్న భారీ ఆయిల్ నిల్వల్ని అమ్ముకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రస్తుతం భారత్ మార్కెట్ ఒక ఆశగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల రిఫైనరీలతో ఇరాన్ చర్చలు నడుపుతోంది. ప్రస్తుతం ఇరాన్ సముద్రంలో కోట్లాది బ్యారెళ్ల ఆయిల్ ఉంది. చమురును విక్రయించేందుకు ఇరాన్ వేగంగా పావులు కదుపుతోంది.
అమెరికా ఆంక్షల కారణంగా భారత్ చాలా కాలంగా క్రితమే ఇరాన్ ఆయిల్ కొనుగోలును నిలిపేసింది. అయితే, ఇప్పుడు రెండు నెలల సడలింపుతో ఇరాన్ భారత్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. భారత్ వంటి పెద్ద మార్కెట్ ఇరాన్‌కు ఇప్పుడు అవసరం. ప్రస్తుతం ఇరాన్ వద్ద 6.8 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ ముడిచమురు ట్యాంకర్లలో నిల్వ ఉంది. ఇందులో 80 శాతానికి పైగా చమురుకు స్పష్టమైన కొనుగోలుదారులు లేరు. భారత్ సమీపంలోనే ఇరాన్ ఉండటంతో కేవలం రెండు మూడు రోజుల్లోనే ఆయిల్ ట్యాంకర్లు భారత ఓడరేవుల్ని చేరే అవకాశం ఉంది.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
అయితే, భారత రిఫైనరీలు ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు తొందరపడటం లేదు. ఆగస్టు వరకు అవసరమైన ముడి చమురు దిగుమతుల్ని వివిధ దేశాల నుంచి ఖరారు చేసుకుంది. ఇదే కాకుండా, అమెరికా ఆంక్షలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి ఉంది. గతంలో పలుమార్లు ఆంక్షల్ని విధించడం, ఎత్తేయడం చేసింది. ఇదే కాకుండా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో బీమా, నిధుల సమీకరణ, నౌకా రవాణా వంటి అంశాలు సవాళ్లలో కూడుకున్నాయి. అయితే, ఇరాన్ చమురు విషయంలో తొందరలో ఉండటంతో తక్కువ రేటు కోసం భారత్ బేరసారాలు చేసే అవకాశం లేకపోలేదు.
చమురు దిగుమతుల కన్నా ఇరాన్‌తో ఎల్పీజీ, ఎరువులు, పెట్రో కెమికల్స్ వంటి భారత్ సహకారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అమెరికా ఆంక్షల సడలింపు దీర్ఘకాలం కొనసాగితే మళ్లీ భారత్ ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?