NTV Telugu Site icon

IPS officer: విషాదం.. పోస్టింగ్‌కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..

Ips Officer

Ips Officer

IPS officer: ఎంతో కష్టపడి సివిల్స్ క్లియర్ చేశాడు, ఎన్నో ఆశలతో పోస్టింగ్‌లో చేరేందుకు వెళ్తున్న యువ ఐపీఎస్ అధికారి విగతజీవిగా మారాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కర్ణాటక కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ అధికారి అయిన 26 ఏళ్ల హర్ష్ బర్ధన్ మరణించడం తీవ్ర విషాదానికి కారణమైంది.ఆయన మైసూర్ లోని కర్ణాటక పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు.

Read Also: Suman Kumar: హ్యాట్రిక్‭తోపాటు పది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన సుమన్ కుమార్

హాసన్‌కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని కిట్టనే సమీపంలో సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. హసన్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బర్ధన్ ప్రయాణిస్తున్న కారు పగిలిపోవడంతో డ్రైవర్ జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్(డీఏఆర్) కానిస్టేబుల్ మంజేగౌడ అదుపుతప్పాడు. ఆ తర్వాత కార్ ఓ ఇంటిని, రోడ్డు పక్కన చెట్టుని ఢీకొట్టింది. బర్ధన్ తలకు బలమైన గాయాలు కావడంతో హసన్‌లోని జనప్రియ ఆస్పత్రికి తరలించారు. బెంగళూర్ తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించేటప్పటికీ, అప్పటికే చికిత్స పొందతూ మరనించాడు. డ్రైవర్ మంజేగౌడకు స్వల్పగాయాలై చికిత్స పొందుతున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలోని దోసర్ గ్రామానికి చెందిన బర్ధన్, హోలెనరసిపూర్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టేందుకు హాసన్‌కు వెళ్తున్నాడు. అతడి కుటుంబం బీహార్‌లో ఉంది. అతడి తండ్రి అఖిలేష్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. సివిల్ ఇంజనీర్ అయిన బర్ధన్ ఆరు నెలల జిల్లా ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బర్ధన్ మృతిపై విచారం వ్యక్తి చేశారు. సంవత్సరాల కృషి ఫలిస్తున్ను సమయంలో ఇలా జరగాల్సింది కాదని అన్నారు. మాజీ సీఎం సదానంద గౌడ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావంతో కూడిన యువ అధికారిని కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు.

Show comments