IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
- పెళ్లితో ఒక్కటైన ఐపీఎస్ అధికారుల జంట
- రాజస్థాన్‌లో గ్రాండ్‌గా జరిగిన వివాహం
- అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన అన్షికా వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారుల జంట ఆదివారం రాత్రి పెళ్లితో ఒక్కటయ్యారు. మూడు ముళ్లు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇరువురు చేసిన ప్రమాణాలతో గ్రాండ్‌గా వివాహం జరిగింది. బరేలీ ఏఎస్పీ అన్షికా వర్మ, సంభాల్ ఎస్పీ కేకే బిష్ణోయ్ వివాహం జోధ్‌పూర్‌లోని అజిత్ ప్యాలెస్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ఇక సోమవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. మంచి గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. సంగీత్ కార్యక్రమాలతో ఉల్సాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో వరుణుడు రాకతో విందుకు ఆటంకం కలిగింది. వర్షం కారణంగా రిసెప్షన్‌ను అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది.
ఇక ఐపీఎస్ పెళ్లి కూతురు అన్షికా వర్మను అప్పగించే సమయంలో ఒక్కసారిగా వాతావరణం దు:ఖమయంగా మారిపోయింది. రాజస్థాన్ ఆచార ప్రకారం నృత్యాలు, సంగీత్ కార్యక్రమంతో అప్పగిస్తున్న సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పెళ్లి కూతురు అన్షికా వర్మ కన్నీటి పర్యంతం అయింది. తల్లిని, చెల్లిని కౌగిలించుకుని చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఉల్లాసం కాస్త దు:ఖమయంగా మారిపోయింది. మొత్తానికి బంధువులు, శ్రేయోభిలాషులు అన్షికా వర్మను కౌగలించుకుని తలపై చేతులు వేసి ఆశీర్వదించి భర్తతో పంపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
A post shared by Anmol Agarwal || Chandausi_mini_Vrindavan (@chandausi_mini_vrindavan)
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!