Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: టేకాఫ్‌ ముందు ఇంధన స్విచ్‌లు బాగానే ఉన్నాయి.. అంతలోనే ఎలా ఆగాయి? దీనిపైనే ప్రత్యేక ఫోకస్‌..!

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చాక లేనిపోని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అటు బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆవేదన.. ఇటు ప్రయాణికుల్లోనూ సరికొత్త భయాందోళనలు నెలకొన్నాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన విమానం.. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బాగానే వచ్చింది. అప్పుడు ఎలాంటి సమస్య కనపించలేదు. కానీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు టేకాఫ్‌ అయినప్పుడు మాత్రం ఇంధన స్విచ్‌లు రెండు ఆగిపోయాయి. అంతేకాకుండా విద్యుత్ సరఫరా కూడా వెంటనే నిలిచిపోయింది. సాఫ్ట్‌వేర్ కూడా పని చేయలేదు. దీంతో విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. అయితే విమానంలో ఇంధన స్విచ్‌లు బాగానే ఉన్నట్లుగా తేలింది. కానీ టేకాఫ్ అయిన తర్వాత ఫ్యూయల్ స్విచ్‌లు ఎందుకు ఆగిపోయాయన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం దీనిపైనే దర్యాప్తు బృందం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ మేరకు వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూాడా చదవండి: Shubhanshu Shukla: 18 రోజులు అంతరిక్షంలో గడిపి తిరిగొచ్చిన వేళ.. భార్యాబిడ్డలను గుండెలకు హత్తుకుని భావోద్వేగం..

ప్రాథమిక నివేదికలో టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అకస్మాత్తుగా ఇంధన సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్ వైఫల్యం చెందిందా? లేదంటే సాఫ్ట్‌వేర్ వైఫల్యం జరిగిందా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తుది నివేదిక ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక లోపాలు కారణంగా ఇంజిన్‌లో ఏదైనా సమస్య తలెత్తిందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తు్న్నారు. ఇక సెక్షన్ల వ్యవధిలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లను కట్-ఆఫ్ మోడ్‌లోకి ఎలా వెళ్లాయన్న దానిపై కూడా ఫోకస్ పెట్టారు. విద్యుత్, సాఫ్‌వేర్ సమస్యలు ఏమైనా తలెత్తాయా? అనే దిశగా లోతుగా పరిశీలిస్తున్నారు. లేదంటే సిస్టమ్-ట్రిగ్గర్డ్ అన్-కమాండ్డ్ ట్రాన్సిషన్ సంభవించి.. ఇంజిన్లు అనుకోకుండా షట్ డౌన్ అయ్యాయా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా కథనాలు వస్తున్నాయి.

ఇది కూాడా చదవండి: Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ వార్నింగ్.. ఈసారి కాలు దువ్వితే..!

అయితే విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వస్తున్నప్పుడు పైలట్.. ‘స్టెబిలైజర్ పొజిషన్ ట్రాన్స్‌డ్యూసర్ లోపం’ను గుర్తించినట్లుగా ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ట్రాన్స్‌డ్యూసర్ అనేది విమాన నియంత్రణ వ్యవస్థకు సంకేతాలను పంపడం ద్వారా విమానం పిచ్‌ను నియంత్రించడంలో సహాయపడే సెన్సార్. బోయింగ్ ప్రోటోకాల్‌ల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడినట్లుగా కూడా సమాచారం ఉన్నట్లు అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విమానంలో అనుకోని ఇంధన కట్-ఆఫ్ సిగ్నల్ కూడా ఉంటుందని సమాచారం. ఆ లోపం వల్లే క్రాష్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. లేదంటే సెన్సార్ వైఫల్యాలకు గురై ఇంజిన్ షట్‌డౌన్‌ అయిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇది కూాడా చదవండి: Earthquake: అలస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో.. పైలట్‌ల్లో ఒకరు మరొకరిని ఎందుకు కట్-ఆఫ్ చేశావని అడుగుతున్నట్లు వినబడింది. మరొక పైలట్ తాను అలా చేయలేదని ప్రతిస్పందించాడు అని ప్రాథిమక నివేదిక తెలిపింది. అయితే విమానంలో 11A దగ్గర కూర్చున్న ప్రయాణీకుడు విశ్వాష్‌కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు దర్యాప్తు అధికారులతో మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో ఆగిపోయిందని చెప్పాడు. ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయని పేర్కొన్నాడు. క్రాష్‌ కాకుండా చూసేందుకు పైలట్లు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా రమేష్ తెలిపాడు. కానీ అంతలోనే కూలిపోయిందని చెప్పాడు. ఇక విమానం కూలిపోక ముందు కేవలం 625 అడుగుల ఎత్తులోనే ఉంది. అదే 3,600–4,900 అడుగుల ఎత్తులో ఉంటే మాత్రం విమానం ప్రమాదానికి గురి కాకుండా నియంత్రించొచ్చు. అందువల్లే పైలట్లకు సాధ్యం కాలేదు.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.

Exit mobile version