NTV Telugu Site icon

Odisha: హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు..

Odisha

Odisha

Odisha: ఒడిశాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన బైకు ర్యాలీలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఏప్రిల్ 12న సంబల్‌పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో సంబల్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం 10 గంటల నుంచి 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిషేధాజ్ఞలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఏప్రిల్ 15 వరకు వచ్చే 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు.

Read Also: Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం

హనుమాన్ జయంతి సామాన్య సమితి సభ్యులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏప్రిల్ 12 సాయంత్ర 6 గంటల సమయంలో చేపట్టిన బైక్ ర్యాలీ సమయంలో పట్టణంలోని హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభద్రతకు భంగం కలిగించడానికి దుండగులు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇతర మీడియా వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మతపరమైన భావాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని, దీంతోనే ఇంటర్నెట్ సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సంబల్ పూర్ ఎస్పీ బీ గంగాధర్ ఈ ప్రాంతంలో గురువారం రోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, శాంతిభద్రతల కోసం సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘర్షణలకు కారణం అయిన వారిలో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, ముగ్గురు పోలీసులు గాయపడినట్లు ఎస్పీ వెల్లడించారు.