NTV Telugu Site icon

Internet: ఆ రాష్ట్రంలో సొంత ఇంటర్నెట్.. ఇండియాలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు

Pinaray Vijayan

Pinaray Vijayan

దేశంలో అక్షరాస్యత, ఉత్తమమైన గ్రామ పంచాయతీ వ్యవస్థతో పాటు టెక్నాలజీ, ఇంటర్నెట్ వినియోగంలో ముందు వరసలో ఉంటుంది కేరళ రాష్ట్రం. తాజాగా మరో ఘనత సాధించింది కేరళ. దేశంలో సొంత ఇంటర్నెట్ సేవలు కలిగిన రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేరళలో ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడానికి విజయన్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఇంటర్నెట్ తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ లిమిటెడ్, టెలికమ్యూనికేషన్ శాఖ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సమాజంలో డిజిటర్ అంతరాలను పూడ్చేందుకు సహాయపడుతుందని అన్నారు. కేరళలో ఈ పథకం ద్వారా బిలో పోవర్టీ లైన్( బీపీఎల్) దిగువన ఉన్న వారికి 30,000 ప్రభుత్వ ఆఫీసులకు ఇంటర్నెట్ అందించనున్నారు.

Read Also: Ripudaman Singh Malik: 1985 ఎయిర్ ఇండియా బాంబ్ దాడి.. దారుణ హత్య
‘‘ దేశంలో కేరళ తన సొంత ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా అవతరించిందని.. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ లిమెటెడ్ కు, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిషన్ నుంచి ఐఎస్పీ లైసెన్స్ వచ్చిందని.. మా ప్రతిష్టాత్మక్ కేఎఫ్ఓఎన్ ప్రాజెక్ట్ ప్రజలకు ఇంటర్నెట్ ను ప్రాథమిక హక్కుగా అందించేలా కార్యకలాపాలు ప్రారంభిస్తుంది’’ అంటూ కేరళ సీఎం పినరయి విజయన్ ట్వీట్ చేశారు.