Site icon NTV Telugu

Cyber Attacks: నుపుర్ శర్మ ఎఫెక్ట్,, భారత్‌పై సైబర్ ఎటాక్స్‌..

Cyber Attacks

Cyber Attacks

బీజేపీ నేత నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి… ఓవైపు ముస్లిం దేశాల నుంచి భారత్‌పై తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు.. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశానికే ముప్పు తలపెట్టేలా మారగా.. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. తాజాగా, భారత్‌పై సైబర్‌ ఎటాక్స్‌ మొదలయ్యాయి.. దీనికి ప్రధాన కారణం కూడా నుపుర్ శర్మ కామెంట్స్‌గానే తెలుస్తోంది..

భారత్‌లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయి.. హ్యాక్‌టివిస్ట్ గ్రూప్ డ్రాగన్‌ఫోర్స్ మలేషియాచే నిర్వహించబడిన దాడులు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క ఈ-పోర్టల్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. మొత్తంగా భారత వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరిగాయి.. దేశవ్యాప్తంగా పోర్టల్స్‌తో సహా 70 వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు.. కురుదేశ్‌ కోరడ్స్‌ పేరుతో ఈ దాడులు జరిగినట్టు గుర్తించారు.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భవన్‌లు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కళాశాలల వంటి ప్రముఖ విద్యాసంస్థలను కూడా వదిలిపెట్టలేదు. ఒక్క మహారాష్ట్రలోనే 50కి పైగా వెబ్‌సైట్‌లు ధ్వంసమైనట్లు గుర్తించారు. ఆడియో క్లిప్‌లు మరియు టెక్స్ట్‌ల ద్వారా ఒక సందేశాన్ని పంపించారు.. మీ కోసం మీ మతం మరియు నాకు నా మతం.. ముస్లిం హ్యాకర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు, మానవ హక్కుల సంస్థలు మరియు కార్యకర్తలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా పిలుపునిచ్చారు హ్యాకర్లు.

హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్‌ కంపెనీలపై సైబర్‌ దాడులు జరిగినట్టు గుర్తించారు. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌ను ఆదివారం నాటికి భారత అధికారులు పునరుద్ధరించగలిగారు. అయితే ఐసీఏఆర్‌ పేజీలలో ఒకటి ఇప్పటికీ పునరుద్ధరించలేకపోయినట్టుగా సమాచారం.. జూన్ 8 నుంచి 12 మధ్య భారత ప్రభుత్వ వెబ్‌సైట్లు, అలాగే ప్రైవేట్ పోర్టళ్లపై సైబర్‌ ఎటాక్‌ జరిగినట్టు నిపుణులు నిర్ధారించారు.. అదే హ్యాక్‌టివిస్ట్ గ్రూప్ ద్వారా భారతదేశంలోని ప్రముఖ బ్యాంకుల సర్వర్లను కూడా హ్యాక్‌ చేసే ప్రయత్నాలు జరిగినట్లు భద్రతా నిపుణులు సూచించారు.

Exit mobile version