Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Instagram Influencer Neha Mishra Booked For Doing Item Song Reel In Temple

Item Song In Temple: గుడిలో ఐటమ్ సాంగ్.. యువతిపై కేసు నమోదు

Published Date :October 4, 2022 , 6:02 pm
By NTV WebDesk
Item Song In Temple: గుడిలో ఐటమ్ సాంగ్.. యువతిపై కేసు నమోదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Instagram Influencer Neha Mishra Booked For Doing Item Song Reel In Temple: సోసల్ మీడియాలో లైక్స్ & ఫాలోవర్స్ కోసం ఈమధ్య యువత హద్దుమీరుతోంది. మన సంస్కృతి సంప్రదాయాల్ని సైతం లెక్క చేయకుండా చిందులేస్తోంది. తాజాగా ఓ అమ్మాయి కూడా అలాగే హద్దు మీరింది. గుడి ఆవరణలో ఐటెం సాంగ్‌పై చిందులేసి, నెట్టింట్లో పోస్ట్ చేసింది. అది వైరల్ అవ్వడం, దానిపై దుమారం చెలరేగడంతో.. ఆ యువతి ఇప్పుడు చిక్కుల్లో పడింది. స్వయంగా హోంమంత్రే ఆమెపై కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయమన్నారంటే.. వ్యవహారం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. నేహా మిశ్రా అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే.. ఇంకా ఫాలోవర్స్ సంపాదించాలన్న మోజులో ఆ యువతి అక్టోబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ దేవాలయం ఆవరణలో ‘దబాంగ్’ సినిమాలోని ‘మున్నీ బద్నాం హుయి’ అనే పాటపై డ్యాన్స్ చేసింది. అది కూడా చిరిగిన జీన్స్‌లో ఆ యువతి అసభ్యకరమైన అభ్యంతకరంగా నృత్యం చేసింది. తాను ఉన్నది ఎంతో పవిత్రమైన చోటు. అక్కడికి చిరిగిన జీన్స్ వేసుకొని వెళ్లడమే పెద్ద తప్పు, అది కాకుండా ‘మున్నీ బద్నాం హుయి’ అంటూ ఐటెం సాంగ్‌పై డ్యాన్స్ చేయడం చూస్తుంటే.. ఆ యువతి కావాలనే ఈ వీడియో చేసినట్టు కనిపిస్తోంది. తన వీడియో వివాదాస్పదమైతే, మరింత ఫేమస్ అవ్వొచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు స్పష్టమవుతోంది.

మొత్తానికి నేహా శర్మ అనుకున్నదే జరిగింది. ఆ వీడియో వైరల్ అవ్వడం, బజరంగ్ దళ కంట పడడంతో.. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తారాస్థాయిలో విమర్శలు వచ్చిపడ్డాయి. దీంతో నేహాశర్మ క్షమాపణలు చెప్పింది. మతపరమైన మనోభావాలు దెబ్బ తీసినందుకు ఆ వీడియోను డిలీట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ఆమె క్షమాపణలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్ర సానుకూలంగా స్పందించలేదు. ఆమె వస్త్రధారణ, ఆ వీడియో అభ్యంతకరకంగా ఉన్నాయని.. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకున్నామన్నారు. అయినా ఆ అమ్మాయి హద్దుమీరింది కాబట్టి.. ఆమెపై కేసు నమోదు చేయబోతున్నామని మిశ్రా తెలిపారు. ఈ మేరకు ఛతర్‌పూర్ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌కు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • home minister Narottam Mishra
  • Instagram Influencer Neha Mishra
  • Item Song Reel in Temple
  • Munni Badnam Hui Song
  • Neha Mishra Temple Controversy

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions