Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు

  • ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పోస్టులు తొలగించేలా చర్యలు..
  • సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు..
Abhijeetdipke

Abhijeetdipke

Abhijeet Dipke: ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకుంటోందని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్‌ తమ పోస్టుల్ని తొలగిస్తోందని అన్నారు. ప్రతీ రోజూ వేలాది పోస్టులను తొలగించేలా ఇన్‌స్టాపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ చర్యల వల్ల ప్రజల ప్రశ్నలు కనుమరుగు కావని అన్నారు.

“ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ప్రతిరోజూ వేలాది పోస్టులు, ఖాతాలను తొలగిస్తోంది. అయితే, ఒక ప్రాథమిక విషయాన్ని విస్మరిస్తోంది. ప్రజలు తమ ప్రశ్నలను లేవనెత్తడానికి ఇన్‌స్టాగ్రామ్ ఒక వేదిక మాత్రమే. ఆ ప్రశ్నలకు కారణాలు సోషల్ మీడియాకు అతీతంగా ఉన్నాయి. ఖాతాలను తొలగించినంత మాత్రాన ఆ సమస్యలు మాయమైపోవు” అని అభిజిత్ దీప్కే ఎక్స్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల వల్ల ప్రజల్లో మరింత అవిశ్వాసం పెరిగే ప్రమాదం ఉందని దీప్కే వార్నింగ్ ఇచ్చాడు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు పెరిగేలా ఇలాంటి చర్యలు తోడ్పతుతాయని అన్నారు. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది అకౌంట్లను అణచివేస్తున్నారని ఆరోపించారు. భారత్‌లో వేలాది ఇన్‌స్టా అకౌంట్లపై ఆంక్షలు విధించారని, లక్షలాది వీడియోలను తొలగించారని ఆరోపించారు.