Techie quits job to become a farmer: వ్యవసాయం.. ప్రస్తుతం చాాలా మందిలో పనికి రాని రంగంగా భావిస్తుంటారు. ఏం చేతకాని వాడు మాత్రమే వ్యవసాయం చేస్తాడనే అపోహా చాలా మందిలో ఉంది, కానీ చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేస్తే ఎలాంటి అద్భుతాలు చేయగలడో చాలామంది చేసి నిరూపించారు. ఇప్పటికీ భారత సమాజంలో సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగాలంటే మోజు. రైతు అంటే ఆమడదూరం వెళ్తున్నారు. 20కి మించి ఎకరాలు ఉన్న వ్యక్తికి కనీసం పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయంపై మక్కువ ఉన్నా కూడా చాలా మంది యువత సిటీల్లో ఏదో జాబ్ చేస్తూ బతుకీడుస్తున్నాడు.
ఇదిలా ఉంటే కొందరు మాత్రం తమకు మక్కువ ఉన్న రంగంలోకి వెళ్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు వెంకటసామి విఘ్నేష్. ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలో ఉద్యోగం నెలకు రూ. 40,000 జీతం అయినా ఇవన్నీ వదిలేసి తనకు మక్కువ ఉన్న వ్యవసాయ రంగంలోకి వెళ్లేందుకు ఉద్యోగం మానేశాడు. తల్లిదండ్రులు మొదట్లో భయపడ్డా కూడా ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ.. వారి భయాలను దూరం చేశాడు.
జపాన్ దేశంలో వంకాయ రైతుగా మారి నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నాడు. తాను వదిలేసిన ఉద్యోగం కన్నా ఎక్కవ వార్షిక ప్యాకేజీని పొందుతున్నాడు. వ్యవసాయ మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన విఘ్నేష్ లాక్డౌన్ కాలంలో వ్యవసాయం పట్ల మరింత మక్కువ పెంచుకున్నాడు. అయితే వ్యవసాయం ఒడిదొడుకులతో కూడుకున్నదిగా విఘ్నేష్ కుటుంబం ముందు ససేమిరా అంది. స్థిరమైన ఆదాయం వచ్చే ఐటీ జాబ్ చేయాలని కొడుకుకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో జపాన్ నుంచి ఓ అవకాశం వచ్చింది. జపనీస్ భాష, సంస్కృతిలో శిక్షణ ఇచ్చే సంస్థ గురించి విఘ్నేష్ కు అతని స్నేహితుడు చెప్పాడు. విఘ్నేష్ నిహాన్ ఎడ్యుటెక్ అనే ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఈ సంస్థ శిక్షణ ఇచ్చి జపాన్ లో ఉద్యోగాలు ఇచ్చేందుకు సహాయపడింది. ఆరు నెలల తర్వాత అతనికి జపాన్ లోని వంకాయ పండించే ఫాంలో వ్యవసాయ కార్మికుడిగా ఉద్యోగం లభించింది. అయితే తాను శాశ్వతంగా జపాన్ లో ఉండేందుకు ప్లాన్ చేసుకోలేదని, అక్కడి వ్యవసాంయలో మెలుకువలు తెలుసుకుని భారత్ కు తిరిగి వచ్చి ఇక్క అమలు చేస్తానని తెలిపాడు.