Site icon NTV Telugu

Baglihar Dam: చీనాబ్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసిన భారత్.. పాకిస్తాన్‌లో భయం భయం..

Baglihar

Baglihar

Baglihar Dam: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయాలో పాటు శిక్షణా శిబిరాలు ధ్వంసం అయ్యాయి. దాదాపుగా 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also: MP Priti Patel: ‘‘పాకిస్తాన్‌‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..

ఇదిలా ఉంటే, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలుపుదల ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, చీనాబ్ నదిపై భారత్ నిర్మించిన సలాల్, బాగ్లిహార్ డ్యాముల గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్‌లోని నది ఎండిపోయింది. తాజాగా, భారత్ బాగ్లీహార్ డ్యామ్ గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా వరద నీరు పాకిస్తాన్‌కి వెళ్తోంది. దీంతో మరోసారి, పాకిస్తాన్‌లో భయం పుట్టింది. అయితే, జమ్మూ కాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు పెరగడంతో గేట్లు ఎత్తేసినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా భారత్ ఈ చర్య చేపట్టలేదని తెలుస్తోంది.

గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా వరద నీరు పాకిస్తాన్ వైపు వెళ్తోంది. ముఖ్యంగా, నదీ ఒడ్డున ఉన్న ముజఫరాబాద్, సియాల్ కోట్ సహా పలు ప్రాంతాలను వరద ముంచెత్తే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే, భారత్ నీటిని ఒక అస్త్రంగా మార్చుకుందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. సింధు నది దాని ఉపనదుల నీటిని నిలిపివేయడం యుద్ధ చర్యతో సమానం అని పాకిస్తాన్ చెబుతోంది.

Exit mobile version