Indus Water treaty: పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకునే వరకు భారతదేశం ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలుపుదలలో ఉంచుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం చెప్పారు. ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని రోజుల తర్వాత విదేశాంగ శాఖ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ ఒప్పందం ముందుమాటలో పేర్కొన్న విధంగా సద్భావన, స్నేహ స్పూర్తితో సింధు జలాలా ఒప్పందం కుదిరింది. అయితే, పాకిస్తాన్ దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సూత్రాలను పాటించలేదు’’ అని జైస్వాల్ అన్నారు.
Read Also: Puri Musings: నలుగురిలో నలిగిన ప్రతిసారీ ఇలా చేయండి.. గాయాలన్నీ మానుతాయి: పూరి
‘‘ఏప్రిల్ 23 నాటి భద్రతా కేబినెట్ కమిటీ (CCS) నిర్ణయం ప్రకారం, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి విశ్వసనీయంగా, తిరిగి మార్చలేని విధంగా మద్దతును విరమించుకునే వరకు భారతదేశం ఒప్పందాన్ని నిలుపుదల చేస్తుంది. వాతావరణ మార్పు, జనాభా మార్పులు మరియు సాంకేతిక మార్పులు భూమిపై కొత్త వాస్తవాలను సృష్టించాయని కూడా గమనించండి’’ అని పాకిస్తాన్‌కి విదేశాంగ శాఖ తెలిపింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయారు. పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో, 1960లో పాకిస్తాన్‌తో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ప్రధాని మోడీ, ఈ ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ ఆపరేషన్ సిందూర్ స్పీచ్‌లో క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ‘‘రక్తం నీరు కలిసి ప్రవహించలేవు. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవు, ఉగ్రవాదం వాణిజ్యం కూడా జరగవు’’ అని అన్నారు.
