Site icon NTV Telugu

Indo-Pak Border: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండో-పాక్ సరిహద్దు కంచె.. వీడియో వైరల్

Indopak

Indopak

ఉత్తర భారత్‌ను ఈ ఏడాది భారీ వర్షాలు ముంచెత్తాయి. కౌడ్ల బరస్ట్ కారణంగా జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక రావి నది ఉధృతి కారణంగా పంజాబ్ సరిహద్దు బెల్టు అంతటా విధ్వంసం సృష్టించింది. దీంతో ఇండో-పాక్ సరిహద్దులో దాదాపు 30 కి.మీ. ఇనుప కంచె కొట్టుకుపోయింది. దీంతో భద్రతా దళాలు డజన్ల కొద్దీ పోస్టులను ఖాళీ చేయాల్సి వచ్చింది. గురుదాస్‌పూర్, అమృత్‌సర్, పఠాన్‌కోట్ జిల్లాల్లోని 50 కి పైగా బీఎస్‌ఎఫ్ చెక్‌పోస్టులు దెబ్బతిన్నాయి. ఇనుప సరిహద్దు కంచె దాదాపు 30 కిలోమీటర్లు కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య

ఓ వైపు నష్టం జరిగినప్పటికీ బీఎస్ఎఫ్ సిబ్బంది మాత్రం తమ గస్తీని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితులున్నా.. పడవలతో పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అదునుగా మాదకద్రవ్యాల స్మగ్లర్లు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైన్యం గుర్తించింది. దీంతో భద్రతను మరింత కఠినతరం చేశారు. స్మగ్లర్ల ప్రయత్నాలను దళాలు అడ్డుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్‌పై డిప్యూటీ సీఎం చిందులు

గుర్దాస్‌పూర్‌లో దాదాపు 30 నుండి 40 వరకు అవుట్‌పోస్టులు మునిగిపోయాయి. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. గురుదాస్‌పూర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్ సెక్టార్లలో దాదాపు 30 కి.మీ. ఫెన్సింగ్ కొట్టుకుపోయిందని బిఎస్‌ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎకె విద్యార్థిని తెలిపారు. అమృత్‌సర్‌లోని షాజాదా గ్రామంలో నీటి మట్టం పెరగడంతో సైనికులు కమల్‌పూర్‌లోని బీఎస్‌ఎఫ్ పోస్ట్‌ను ఖాళీ చేశారు. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ సమీపంలోని ప్రసిద్ధ బీఎస్‌ఎఫ్ పోస్ట్ కూడా మునిగిపోయింది. సిబ్బంది తాత్కాలికంగా డేరా బాబా నానక్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు తరలివెళ్లారు. రావి నది జీరో లైన్‌కు రెండు వైపులా వరదలు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ రేంజర్లు కూడా తమ ఫార్వర్డ్ పోస్ట్‌లను వదిలివేయాల్సి వచ్చిందని ఒక అధికారి తెలిపారు. రాబోయే మూడు రోజులు వర్షాలు లేనందున నీటి మట్టాలు తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితులు అంతా సర్దుకుంటాయని వెల్లడించారు.

 

Exit mobile version