Site icon NTV Telugu

Congress: “ఇందిరాగాంధీ శ్రీహరికోటకు ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు”.. మోడీ ప్రోటోకాల్‌పై విమర్శలు..

Pm Modi

Pm Modi

Congress: చంద్రయాన్-3 విజయం తర్వాత నేరుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గ్రీస్ పర్యటన నుంచి బెంగళూర్ చేరుకుని శాస్త్రవేత్తలను అభినందించారు. అయితే ఈ పర్యటన ప్రోటోకాల్ వివాదానికి కారణమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తోంది.

1983లో ఎస్ఎల్వీ-3-డీ2 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న ఎన్టీ రామారావుని శ్రీహరికోటకు ఆహ్వానించిన విషయాన్ని కాంగ్రెస్ మంగళవారం గుర్తుచేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ గత జ్ఞాపకాలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

Read Also: Minister Sidiri Appalaraju: ఎన్టీఆర్‌ బొమ్మతో చంద్రబాబు రాజకీయం

బ్రిక్స్ సమ్మిట్ లో దక్షిణాఫ్రికాలో ప్రధాని మోడీ ఉన్న సమయంలో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. ఆ తరువాత గ్రీస్ పర్యటకు వెళ్లిన మోడీ నేరుగా బెంగళూర్ లోని హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే తెల్లవారుజామున ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రావద్దని చెప్పినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ప్రోటోకాల్ వివాదంపై కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత ఆర్ అశోక, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Exit mobile version