NTV Telugu Site icon

Indira Gandhi: లోక్‌సభ ఎన్నికల బరిలో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు..

Sarabjeet Singh

Sarabjeet Singh

Indira Gandhi: దివంతగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్ ఖర్సా(45) పంజాబ్ ఫరీద్ కోట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇందిరాగాంధీని చంపిన ఇద్దరు నిందితుల్లో బియాంత్ సింగ్ ఒకరు.

Read Also: Amit Shah: “ఆర్టికల్ 370ని మార్చే ధైర్యం చేయకండి”.. కాంగ్రెస్‌కి అమిత్ షా వార్నింగ్..

ఈయన గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యాడు. 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు అనూహ్యంగా 1,13,490 ఓట్లు వచ్చాయి. 2007లో బదౌర్ నుంచి, 2009లో బఠిండా నుంచి, 2014లో ఫతేగఢ్ సాహిబ్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు రూ. 3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఇతని తల్లి బిమల్ కౌర్, తాత సుచా సింగ్ 1989లో వరసగా రోపర్, బఠిండా నుంచి ఎంపీలుగా గెలిచారు.

సరబ్ జీత్ ప్రస్తుతం పోటీ చేస్తున్న ఫరీద్ కోట్ నుంచి కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ సాదిఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద సింగర్ హన్స్‌రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. ఆప్ తరుపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో ఉన్నారు. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అంగరక్షకులు బియాంత్ సింగ్ మరియు సత్వంత్ సింగ్ ఆమె నివాసంలో బుల్లెట్లతో దాడి చేశారు.