NTV Telugu Site icon

Indigo flight: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం.. దెబ్బతిన్న ఇండిగో విమానం టెయిల్ సెక్షన్‌

Indigoflight

Indigoflight

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ దెబ్బతిన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వారం జరిగిన సంఘటనకు సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: PM Modi: అమెరికా వెళ్లనున్న మోడీ.. క్వాడ్ సమావేశానికి హాజరు

సెప్టెంబర్ 9న ఇండిగో ఫ్లైట్ నెం. 6E 6054 ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో టెయిల్ సెక్షన్ భారీగా దెబ్బతింది. విమానంపై ఉండే నీలిరంగు పెయింట్ ఊడిపోయింది. తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ఇది తీవ్రమైన ప్రమాదంగా సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: CM Chandrababu: వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.. నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు

టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్‌వేని తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ జరుగుతుంది. ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది నిర్మాణాత్మక నష్టానికి దారి తీస్తుంది. పైలట్ వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC)కి సమాచారం అందించాడు. ఆ తర్వాత ATC ల్యాండ్‌కి క్లియరెన్స్ ఇచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నాయి. రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) మరియు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. DGCA సిబ్బందిని తొలగించింది. ప్రయాణికులను దింపి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ఇండిగో ఇంకా ప్రకటన ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: AP Govt: మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు

Show comments