IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- ఇండిగో విమానాన్ని తాకిన పిడుగు
- 17,000 అడుగుల ఎత్తులో షాకింగ్ ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo 6E925 Lightning Strike: ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఆకాశంలో పిడుగు తాకింది. సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటు కారణంగా విమానం ముందు భాగం (నోస్) దెబ్బతిన్నప్పటికీ.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా లక్నో విమానాశ్రయంలో దించారు. విమానంలోని 104 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇండిగో 6E925 విమానంలో ఘటన
ఈ ఘటన ఇండిగో విమానం 6E925లో చోటుచేసుకుంది. పాట్నా విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3:10 గంటలకు విమానం బయలుదేరింది. సాయంత్రం 4:20 గంటలకు లక్నో చేరుకోవాల్సి ఉండగా.. లక్నో సమీపంలో ప్రతికూల వాతావరణంలో సుమారు 17,000 అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్న పైలట్ విమానాన్ని లక్నో విమానాశ్రయానికి తీసుకువచ్చారు. సాయంత్రం సుమారు 4:05 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
Also Read
విమానాన్ని గ్రౌండ్ చేసిన అధికారులు
ల్యాండింగ్ అనంతరం పిడుగుపాటు కారణంగా తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిశీలించేందుకు విమానాన్ని లక్నో విమానాశ్రయంలోనే గ్రౌండ్ చేశారు. ఇదే విమానం అనంతరం లక్నో-అహ్మదాబాద్ ఇండిగో 6E6968 విమానంగా నడవాల్సి ఉంది. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇండిగో సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికులు సాయంత్రం 6:22 గంటల సమయంలో మరో విమానంలో అహ్మదాబాద్‌కు బయలుదేరారు.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!