వ్యాక్సినేషన్.. రికార్డు సృష్టించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే తొలిరోజే టీకా పంపిణీలో సరికొత్త రికార్డు సృష్టించింది భారత్. ఆయా రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 75 లక్షల మందికి టీకాలు అందించారు. ఏప్రిల్ 2న 42 లక్షల 65 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉండేది. రాష్ట్రాలకు కేటాయించిన 25 శాతం వ్యాక్సిన్లను వెనక్కి తీసుకున్న కేంద్రం.. అందరికీ ఫ్రీ టీకా అంటూ కొత్త పాలసీని ప్రకటించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో కేంద్రమే 75 శాతం టీకాలు కొని రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది. ఇప్పటివరకు 29 కోట్ల టీకాలను కొనుగోలు చేసి.. రాష్ట్రాలకు ఫ్రీగా ఇచ్చినట్లు చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో మరో 24 లక్షల వ్యాక్సిన్లను అందిస్తామని తెలిపింది.
టీకా పంపిణీలో రాష్ట్రాలు కూడా స్పీడ్ పెంచుతున్నాయి. ఇప్పటివరకు అత్యల్ప టీకా పంపిణీ ఉన్న అసోం కొత్త టార్గెట్ పెట్టుకుంది. రాబోయే పది రోజుల్లో 3 లక్షల టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక 70 శాతం మందికి టీకా పంపిణీ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది లేదని మహారాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. అటు కర్ణాటకలోనూ రోజుకు 7 లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో టీకా పంపిణీ మరింత ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?