Site icon NTV Telugu

Indus Waters Treaty: గన్స్, మిస్సైల్స్ అవసరం లేదు.. పాకిస్తాన్‌ను దెబ్బతీయాలంటే “సింధూ” చాలు

Induswaters

Induswaters

Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ‘‘సింధూ నది ఒప్పందాన్ని’’ నిలిపేసింది. సింధూ నది జలాలను ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ బీరాలు పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన నివేదికలో సింధూ నది జలాలు ఆపితే, పాకిస్తాన్‌కు తీవ్రమై దెబ్బ పడుతుందని చెప్పింది. పాకిస్తాన్ తీవ్రమైన నీటి కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్-2025 పేర్కొంది.

Read Also: Supreme Court: అది ప్రేమ, కామం కాదు.. “పోక్సో కేసు”లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

పాకిస్తాన్ లోకి సింధూ, దాని ఉపనదులు పశ్చిమ దిశ ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని, సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడం ద్వారా భారత్‌కు ఇస్తుందని పేర్కొంది. ఈ పరిణామం పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ అని, పాక్‌లోని వ్యవసాయంలో 80 శాతం సింధూ నది వ్యవస్థపై ఆధారపడి ఉందని చెప్పింది. కీలక సమయాల్లో చిన్న అంతరాయాలు కూడా పాకిస్తాన్ వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయని, పాకిస్తాన్ నీటిని నిల్వ చేసుకునే నిల్వ స్థలం కూడా లేదని చెప్పింది. దాయాది దేశం సొంత ఆనకట్ట సామర్థ్యం సింధూ ప్రవాహాన్ని దాదాపు 30 రోజలకు మాత్రమే కలిగి ఉందని నివేదిక హైలెట్ చేసింది.

సింధూ ప్రవాహాలకు అంతరాయం కలిగిస్తే అది పాకిస్తాన్ ఆహారభద్రతకు ముప్పు కలిగిస్తుందని, తర్వాత జాతీయ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని నివేదిక చెప్పింది. భారత్ నిజంగా సింధూ ప్రవాహాలను తగ్గిస్తే పాకిస్తాన్‌లోని జనసాంద్రత కలిగిన ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి. భారత్ ప్రస్తుత మౌలిక సదుపాయాలు నదులు ప్రవాహాలను ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చిన్న అంతరాయాలు కూడా పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని కదేలు చేస్తాయని చెప్పింది.

Exit mobile version