CMS-03: అత్యంత ‘‘బరువైన’’ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
- అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం..
- కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMS-03: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ను ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 2 ఆదివారం రోజున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటిలైట్ ప్రయోగం జరుగనుంది. ఇది మల్టీ బ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. దీనిని GSAT-7R అని కూడా పిలుస్తారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM3) ద్వారా ప్రయోగించనున్నారు.
Read Also: Yogi Adityanath: సీఎం యోగి కీలక నిర్ణయం.. ముస్తఫాబాద్ పేరు ఇక..
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఈ శాటిలైట్ ద్వారా భారత భూభాగంతో సహా విస్తృత సముద్ర ప్రాంతంలో సేవలు అందిస్తుందని ఇస్రో తెలిపింది. సుమారు 4400 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO)లో చేర్చనున్నారు. LVM3 రాకెట్ భారతదేశంలోనే అత్యంత బరువైన రాకెట్. ఇది 4000 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు.
చంద్రయాన్-3 వంటి మిషన్లను ఈ రాకెట్ ద్వారా చంద్రుడి పైకి విజయవంతంగా ప్రయోగించబడింది. CMS-03 పేలోడ్‌లో డేటా, వీడియో లింక్‌ల కోసం C, ఎక్స్టెండెల్ C, Ku బ్యాండ్లు ఉన్నారు. ఈ శాటిలైట్ నేవీకి కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. ఇది అధిక సామర్థ్యం కలిగిన బ్యాండ్ విడ్త్ ను కూడా అందిస్తుంది. తర్వాత మారుమూల ప్రాంతాలకు డిజిటల్ యాక్సెస్ మెరుగవుతుంది. గతవారం, ఇస్రో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 6.5 టన్నుల బ్లూబర్డ్-6 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తానని ప్రకటించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!