H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజు పెంచడం చివరకు భారత్‌కే ప్రయోజనకరంగా మారబోతోంది. కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షలు) ఫీజు విధించారు. దీంతో, అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించేందుకు ఆలోచిస్తున్నాయి. భారతదేశ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో యూఎస్ లోని చాలా సంస్థలు తమ పనిని భారత్‌కు తరలించాలని చూస్తున్నాయి.
Read Also: Pakistan: క్వెట్టాలో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో సగానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. భారత్ లో ప్రస్తుతం 1700 జీసీసీలు ఉన్నాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నుంచి ఔషధ పరిశోధన, ఫైనాన్షియల్ సర్వీసెస్, లగ్జరీ కార్ డిజైన్స్ వంటి అధునాతన రంగాల్లో పనిచేస్తున్నాయి. దీంతో యూఎస్ కంపెనీలు తన ఆఫ్ షోర్ కార్యకలాపాల కోసం భారత్ వైపు చూస్తున్నాయి.
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లోని జీసీసీలు ప్రపంచ నైపుణ్యం, బలమైన స్థానిక నాయకత్వాన్ని అందిస్తున్నాయి. డెలాయిట్ ఇండియా భాగస్వామి, జీసీసీ పరిశ్రమ లీడర్ రోహన్ లోబో మాట్లాడుతూ.. భారత దేశ జీసీసీలు యూఎస్ సంస్థల వ్యూహాత్మక మార్పులను నడిపించేందుకు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. యూఎస్ సంస్థలు ఇప్పటికే తమ శ్రామిక శక్తి అవసరాలను తిరిగి అంచనా వేస్తున్నా్యని, భారత్‌కు మారాలని యోచిస్తున్నాయని అన్నారు.
