Cervical Cancer Vaccine: భారతదేశ తొలి గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా రేపు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s first vaccine against cervical cancer to come out tomorrow: ప్రపంచ వ్యాక్సిన్ తయారీతో కీలకంగా ఉన్న ఇండియా మరో కీలక మైలురాయిని చేరుకుంది. పూర్తి స్వదేశీగా తయారు చేయబడిన తొలి గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకాను రేపు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 1న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్(క్యూ హెచ్ పీ వీ)ను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ(డీబీటీ)సంయుక్తంగా తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్ కు డగ్ర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) జూలై 12న అనుమతి ఇచ్చింది.
Read Also: CM KCR: గల్వాన్ అమరవీరులకు చెక్కుల పంపిణీ.. వారి త్యాగం గొప్పదన్న సీఎం కేసీఆర్
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యనైజేషన్ చైర్మన్ ఎన్కే ఆరోరా మాట్లాడుతూ.. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ప్రారంభించడం అద్భుతమైన అనుభవం అని అన్నారు.. ఇప్పడు మన కూతుళ్లు, మనవరాళ్లు ఈ వ్యాక్సిన్ పొందుతారని.. ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద 9-14 ఏళ్ల బాలికలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంలో ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమైంది, చివరిదని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని.. 85-90 శాతం గర్భాశయ క్యాన్సర్ కేసులు హ్యామన్ పాపిల్లోమా వైరస్ వల్లే వస్తుందని.. ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ ను నిరోధిస్తుందని ఆయన అన్నారు. చిన్న పిల్లలకు ఇస్తే దాదాపుగా 30 ఏళ్ల క్యాన్సర్ సంభవించదని డాక్టర్ ఆరోరా తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2019 నుంచి భారతదేశంలో 41,91,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ వల్ల మరణించారు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ప్రారంభం అయినప్పుడు దీన్న సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మహిళలందరికీ గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియాలో 30 ఏళ్లకు పైబడిన మహిళలల్లో ఈ క్యాన్సర్ తరుచుగా సంభవిస్తోంది. హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతోంది. ప్రస్తుతం వస్తున్న గర్భాశయ క్యాన్సర్ టీకా.. యోని, వల్వార్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!