NTV Telugu Site icon

Monkeypox Test Kit: మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల

Monkeypox Test Kit

Monkeypox Test Kit

Monkeypox Test Kit: మంకీపాక్స్ పరీక్ష కోసం స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (AMTZ)లో ప్రారంభించారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా బయో-మెడికల్స్ అభివృద్ధి చేసిన ఈ కిట్‌ను విశాఖ మెడ్​టెక్ జోన్‌లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ అత్యంత సున్నితమైనదని, అయితే మెరుగైన ఖచ్చితత్వం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రైమర్, ప్రోబ్‌తో సులభంగా ఉపయోగించగల పరీక్ష అని ఆయన వెల్లడించారు.

lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్

డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ ఆందోళన కలిగించే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్‌ను ముందస్తుగా గుర్తించడంలో, మెరుగైన నిర్వహణలో కిట్ సహాయపడుతుందని ట్రాన్స్ఆసియా వ్యవస్థాపక-చైర్మన్ సురేష్ వజిరానీ చెప్పారు. మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోందని.. ఇప్పటికే 75 దేశాలను చుట్టేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. మంకీ పాక్స్​ను గుర్తించేందుకు ఈ కిట్​ను తొలిసారి భారత్​లో తయారు చేసి.. మేకిన్ ఇండియాలో భాగస్వాములమయ్యామని సురేశ్ వజిరాని వెల్లడించారు. పూర్తిగా దేశీయ సాంకేతికత పరిజ్ఞానంతోనే ఈ కిట్ రూపొందించినట్టు వివరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారు అల్కా శర్మ తదితరులు పాల్గొన్నారు.

Show comments