NTV Telugu Site icon

Military Threat: చైనా తర్వాత అమెరికా నుంచే భారత్‌కు ముప్పు.. సర్వేలో భారతీయుల అభిప్రాయం

Usa, India, China

Usa, India, China

Indians See US As Biggest Military Threat After China, says Survey: భారత దేశానికి సైనిక పరంగా ముప్పు చైనా నుంచి పొంచి ఉందనేది అందరికి తెలిసిన విషయమే. చైనా నుంచే అతిపెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే ఆ తరువాతి స్థానంలో అంతా పాకిస్తాన్ ఉంటుందని అనుకుంటారు.. కానీ, రెండో స్థానంలో అమెరికా నుంచి సైనిక ముప్పు ఉందని భారతీయులు ఓ సర్వేలో తెలిపారు. అమెరికాకు చెందిన గ్లోబల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం.. ప్రతీ 1000 మందిలో 43 శాతం మంది చైనా నుంచి మిలిటరీ ముప్పు పొంచి ఉందని భావిస్తుంటే.. 22 శాతం మంది అమెరికా నుంచి ముప్పు ఉందని అభిప్రాయపడ్డారు. గతేడాది అక్టోబర్ నెలలో ఈ సర్వేను నిర్వహించారు.

2020 నుంచి భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, సరిహద్దు వివాదం కూడా ఉందని చైనా నుంచే ఇండియాకు ఎక్కువ సైనిక ముప్పు ఉందని సర్వేలో తెలిపారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా సహజ భాగస్వాములుగా కనిపిస్తున్నప్పటికీ.. అమెరికా, చైనాల మధ్య ఘర్షణ ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఇండియన్స్ భావిస్తున్నారు. చైనాను అడ్డుకునేందుకు క్వాడ్ లో యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ తో ఇండియా సభ్యదేశంగా ఉంది. అయినప్పటికీ వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని భారతీయులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Central Government: భార్యను భర్త రేప్ చేస్తే నేరం.. మరి భర్తను భార్య రేప్ చేస్తే..?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థంగా ఉంది. రష్యాతో అన్ని వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. డిస్కౌంట్ పై ముడిచమురును కొనుగోలు చేస్తోంది. అయితే ఇదే సమయంలో భారత్ పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే 66 శాతం మంది రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయాలని తెలపగా.. 48 శాతం మంది రష్యా, భారతదేశానికి ముఖ్యమైన సైనిక పరికరాల భాగస్వామిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. 44 శాతం మంది యూఏస్ఏ ఉండాలని అభిప్రాయపడ్డారు. రష్యాతో భారత్ సైనిక విన్యాసాలు చేపట్టాలని 49 శాతం భారతీయులు కోరుకుంటున్నారు.

ఎక్కువ మంది భారతీయులు అమెరికా, నాటో వల్లే భారత్, రష్యాకు దగ్గర ఉందని ఆరోపించారు. యూఎస్ఏతో పోలిస్తే రష్యాతో భారతీయులు సంబంధాలు బలంగా ఉన్నాయని.. భారతీయుల ప్రజల ఆలోచన విధానంలో రష్యా ఉందని.. ఇది మారడానికి ఎక్కువ సమయం పడుతుందని భారత పరిశోధన సీనియర్ డైరెక్టర్ షుమితా దేవేశ్వర్ అన్నారు.