Site icon NTV Telugu

BAPS Hindu Mandir: యూఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అబుదాబి మందిరం విశేషాలు ఇవే..

First Hindu Temple In Abu Dhabi

First Hindu Temple In Abu Dhabi

BAPS Hindu Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందుతున్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్(BAPS) ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అబుదాబి నగరంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 14, 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అబుదాబి ఆలయం అరబ్ దేశాల్లో అతిపెద్ద మందిరంగా, మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులు ఉద్దేశిస్తూ ఫిబ్రవరి 13న ‘అహ్లాన్ మోడీ’ సమావేశంలో ప్రసంగిస్తారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఈ భారీ సమావేశం జరగబోతోంది.

ఇస్లామిక్ దేశంగా ఉన్న యూఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించారు. 2019లో యూఏఈ టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ ప్రముఖులు పాల్గొన్నారు.  జనవరి 29, 2024న 42 దేశాల రాయబారులు, దౌత్యవేత్తల టీం ఆలయాన్ని సందర్శించింది. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ పర్యటనను నిర్వహించారు.

Read Also: Ambajipeta Marriage Band: సుహాస్ మళ్లీ హిట్ కొట్టాడు.. రెండు రోజుల్లో రికార్డ్ కలక్షన్స్

ఆలయ ప్రత్యేకతలు, విశేషాలు:

* యూఏఈలోని 7 ఏమిరేట్స్‌ని ఆలయ ఏడు శిఖరాలు సూచిస్తాయి.

* మొత్తం 27 ఎకరాల్లో ఆలయం నిర్మితమైంది.

* అబు మురీఖా, అల్ రహ్బా సమీపంలో దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవే వెంట ఈ ఆలయం నిర్మితమైంది.

* యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తెప్పించి ఆలయ నిర్మాణంలో వాడారు.

* పూర్తిగా టెక్ ఫీచర్లు, సెన్సార్లు వంటి వాటిని ఆలయంలో అమర్చారు.

* ఆలయంలో రెండు గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి.

* ప్రతీ శిఖరంపై భారతీయ ఇతిహాసాలు, గ్రంధాల కథలను చెక్కారు.

* ప్రార్థనా మందిరాలతో పాటు పిల్లలకు ఆట స్థలాలు, గార్డెన్స్, ఫుడ్ కోర్ట్స్, బుక్ స్టోర్స్, గిఫ్ట్ షాపులు ఉన్నాయి.

* మొత్తం ఆలయ ఎత్తు 108 ఫీట్లు

*40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయిని, 1,80,000 క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని నిర్మాణంలో వాడారు.

* 18 లక్షల ఇటుకలను వాడారు.

* 300 సెన్సార్లను టెంపుల్ కాంప్లెక్స్‌లో అమర్చారు.

* 6,90,000 పని గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించారు.

Exit mobile version