Site icon NTV Telugu

Saudi viral Video: ‘‘గోల్ లైఫ్’’ రిపీట్.. సౌదీ ఎడారి నుంచి రక్షించాలని వేడుకోలు.. యూపీ వ్యక్తి వీడియో వైరల్..

Saudi Viral Video

Saudi Viral Video

Saudi viral Video: పృథ్వీ రాజ్ నటించిన ‘‘గోట్ లైఫ్’’ సినిమా గుర్తుందా.?, ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన హీరో అక్కడి ఎడారిలో తన యజమాని చేతిలో చిక్కుకుపోయి, ఒంటలు కాస్తూ దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ, అక్కడ నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు సౌదీ అరేబియాలో తన యజమాని(కఫీల్) వద్ద చిక్కుకుపోయాడు. తనను ఎలాగైనా రక్షించాలని కోరుతూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన యజమాని తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నాడని చెప్పాడు. ‘‘దయచేసి నాకు సాయం చేయండి, నేను చనిపోతాను’’ అని చెబుతూ ప్రధాని నరేంద్రమోడీని వేడుకున్నాడు.

ప్రయాగ్ రాజ్ లోని ప్రతాప్‌పూర్ హండియా నివాసి సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కలుగచేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చివర్లో విజ్ఞప్తి ఉంది. ‘‘నా గ్రామం అలహాబాద్‌లో ఉంది… నేను సౌదీ అరేబియాకు వచ్చాను. కపిల్ వద్ద నా పాస్‌పోర్ట్ ఉంది. నేను ఇంటికి వెళ్లాలని చెప్పాను, కానీ అతను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడ’’ అని ఆ వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోలో “నేను నా తల్లి వద్దకు వెళ్లాలనుకుంటున్నాను” అని బాధితుడు చెప్పడం చూడవచ్చు. ఈ వీడియో ప్రధాని మోడీ చూసేలా వైరల్ చేయాలని నెటిజన్లను కోరుకున్నాడు.

Read Also: Bihar Elections: బీహార్‌లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే.. బెట్టింగ్ మాత్రం ఈ కూటమికే అనుకూలం..

ఈ వీడియో వైరల్ కావడంతో సౌదీ లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఈ వ్యక్తిని గుర్తించడానికి రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోందని, వీడియో లో సౌదీ అరేబియాలోని ప్లేస్, కాంటాక్ట్ నెంబర్, యజమాని విమరాలు లేనందును తదుపరి చర్యలు తీసుకోలేకపోతున్నామని రాయబార కార్యాలయం ఎక్స్‌లో చెప్పింది.

సౌదీ అరేబియాలో వివాదాస్పద కఫాల(స్పాన్సర్‌షిప్) వ్యవస్థను అధికారికంగా రద్దు చేసిన కొన్ని వారాల తర్వాత ఈ సంఘటన జరిగింది. వలస కార్మికులను దోపిడీ చేయడానికి, దుర్వినియోగం చేయడానిరి వీలు కల్పించే ఈ వ్యవస్థపై చాలా ఆరోపణలు వచ్చాయి. 1950లలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలో విదేశీ కార్మికుల ఉపాధి, కదలికల్ని, సొంత దేశానికి వెళ్లే హక్కును కూడా నియంత్రించే అధికారం యజమానికి ఉంది. ఈ వ్యవస్థ కింద యజమానులు తమ కార్మికుల పాస్‌పోర్ట్ జప్తు చేయవచ్చు. వీరి ఎగ్జిట్ వీసాలను తిరస్కరించవచ్చు. బానిసల పరిగణించే ఈ వ్యవస్థను ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 సంస్కరణలలో భాగంగా రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ సంస్కరణల ద్వారా 13 మిలియన్ల వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం, సౌదీలో 2.5 మిలియన్ల భారతీయులు ఉన్నారు.

Exit mobile version