Nepal: అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో ఒక్కసారిగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపింది. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లు తీవ్రం కావడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే, ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 51కి చేరింది. మరణించిన వారిలో భారతీయ మహిళ కూడా ఉంది. మరో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Arjun Tendulkar: ఎంగేజ్‌మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్జున్!
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ నేపాల్‌లోని ఖాట్మండులోని ఒక హోటల్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో మరణించినట్లు తెలుస్తోంది. ఆ హోటల్‌కు నిరసనకారులు నిప్పంటించడంతో ఆమె మరణించారు. రాజేష్ గోలా అనే మహిళ సెప్టెంబర్ 07న తన భర్త రాంవీర్ సింగ్ గోలాతో కలిసి నేపాల్‌కు వెళ్లారు. వీరిద్దరు హయత్ రీజెన్సీలో బస చేశారు. సెప్టెంబర్ 09 నిరసనకారులు ఆమె ఉంటున్న హోటల్‌కు నిప్పటించారు. ఆమె కిటికీ గుండా తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
మంటల కారణంగా బయటకు వెళ్లే మార్గం మూసుకుపోవడంవతో, ఆమె ఉంటున్న నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. కింద ఉన్న వారు వీరిని రక్షించేందుకు దప్పట్లు, పరుపుపై దూకాలని కోరారు. అయితే, మహిళ భర్త పరుపుపై దూకి స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకోగా, ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
