Indian Techie: భారతదేశంలోని ఓ స్టార్టప్ కంపెనీలో తాను వర్క్ చేస్తున్నానని.. తనను జాబ్ లోకి తీసుకున్నాక సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు.. అలాగే, రోజూ దాదాపుగా 12 నుంచి 15 గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వాపోయాడు. స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకులలో ఒకరు టీమ్ లీడర్ గా ఉన్నారు.. పని విషయంలో ఎదుర్కొంటున్న డౌట్స్ తీర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తే గైడ్ చేయాల్సిన వ్యక్తి అందరి ముందు అవమానించడం తట్టుకోలేక పోయానని సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోస్ట్ చేశాడు.
Read Also: OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !
ఇక, గూగుల్ మీట్ లోనే టీమ్ లీడర్ ముందు ఏడ్చేశానని.. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియడంలేదని సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి రెడ్డీట్ వేదికగా పేర్కొన్నాడు. మీటింగ్ పూర్తైన తర్వాత తాను లీవ్ తీసుకుంటున్నట్లు చెప్పానని ఆ టెకీ చెప్పుకొచ్చాడు. ఆ స్టార్టప్ కంపెనీలో తాను ఎదుర్కొన్న కష్టాలను మొత్తం చెప్తూ టెకీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ.. ఇందులో నీ తప్పేమీ లేదంటూ అతడికి సపోర్టుగా నిలుస్తున్నారు. రోజుల తరబడి ధైర్యంగా పని చేసి ఒక్కసారిగా బరస్ట్ అయ్యావ్.. ఎప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోకండి.. జీతం కన్నా ఆత్మగౌరవం ముఖ్యం.. వెంటనే ఆ కంపెనీకి రిజైన్ చేసిన మరో ఉద్యోగం చూసుకోవాలని ఆ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి నెటిజన్స్ సూచించారు.