భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైలు బోగీల ఎంట్రెన్స్‌లో కెమెరాలు అమర్చనున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. మొత్తం 74,000 కోచ్‌ల్లో తలుపుల దగ్గర కామన్ మూవ్‌మెంట్ ఏరియాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారని ఆదివారం ఒక అధికారి తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రయాణికులు లక్ష్యంగా దుండుగులు చెలరేగిపోవడంతో… ఈ ఆగడాలను అరికట్టేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Jharkhand: రోజూ రైలులో ప్రయాణిస్తున్న కోతి.. కిటికీ పక్కన సీటులో కూర్చొని ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ, పలువురు ఉన్నతాధికారులు శనివారం సమీక్ష నిర్వహించినట్లు అధికారి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 74 వేల కోచ్‌లు, 15 వేల లోకో కోచ్‌లకు సీసీకెమెరాల ఏర్పాటు వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 100 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లినా అత్యంత నాణ్యతతో ఫుటేజీ వచ్చేలా జాగ్రత్తలు పాటించాలని అశ్వినీ వైష్ణవ్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. చీకటిలోనూ వీడియో క్వాలిటీ బాగుండేలా అధునాత సీసీకెమెరాలను అమర్చాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: పైలట్‌పై తీవ్ర ఆరోపణలు.. ఖండించిన పైలట్ సంఘాలు
