Site icon NTV Telugu

ATM in Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ట్రైన్లో ఏటీఎంలు..

Trains

Trains

ATM in Trains: ఇండియన్ రైల్వే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పటి నుంచి షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్ద పెద్ద ఆఫీసుల్లోనే చూసే ఏటీఎం సేవలను.. త్వరలో కదిలే ఏటీఎంలు సైతం రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే, ప్రయోగాత్మకంగా సెంట్రల్‌ రైల్వే తొలిసారిగా ముంబై నుంచి మన్మాడ్‌ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా కదిలే ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు.

Read Also: Pastor Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ కోసం పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు

కాగా, ప్రతి రోజు నడిచే ఈ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో.. ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా పేర్కొన్నారు. ఏసీ కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఈ ఏటీఎంను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి దీనికి షట్టర్‌ డోర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి కోచ్‌లో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: Rashmika : బంధం బలంగా ఉండాలంటే ఒకే ఒక రూల్ చాలు..

అయితే, ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ పత్రి రోజూ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్ జంక్షన్‌ వరకూ ప్రయాణం కొనసాగిస్తుంది. వీటి మధ్య సుమారు ప్రయాణ దూరం 4.30 గంటలు పడుతుంది. కాగా, ఆ మార్గంలో ఈ రైలు కీలకమైంది. ఈ ట్రైన్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలను అమలు చేస్తున్నారు. త్వరలోనే మిగతా మార్గాల్లోని రైళ్లలోనూ కూడా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version